దుకాణాల వద్ద ధరల బోర్డులు ఏర్పాటుచేయాలి
ABN , Publish Date - Sep 29 , 2025 | 10:42 PM
దుకాణాల వద్ద ధరల బో ర్డులను ఏర్పాటుచేయాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారి బాజిరెడ్డి అన్నారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం పీసీపల్లిలో కిరాణా, ఫ్యాన్సీ దుకాణాలను సందర్శించారు.
పీసీపల్లి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): దుకాణాల వద్ద ధరల బో ర్డులను ఏర్పాటుచేయాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారి బాజిరెడ్డి అన్నారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం పీసీపల్లిలో కిరాణా, ఫ్యాన్సీ దుకాణాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధరకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌ను తగ్గించిందన్నారు.
అనంతరం పీసీపల్లి సెంటర్‌లో వివిధ శాఖల ఉద్యోగులు, తదితరులు మానవహారంగా ఏర్పడి తగ్గిన వస్తువుల ధరల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీవీ క్రిష్ణారావు, ఏవో ఎన్.రంగాక్రిష్ణ, ఏపీవో కొండయ్య, ఏపీఎం సత్యానందం, పీసీపల్లి పంచా యతీ కార్యదర్శి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.