సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:59 PM
పీసీపల్లి, మండలంలోని లింగన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పార్కు (ఎంఎస్‌ఎంఈ)ను సీఎం చంద్రబాబు మంగళవారం ప్రారంభించనున్నారు.
రేపు లింగన్నపాలెం రానున్న చంద్రబాబు
ఎంఎ్‌సఎంఈ పార్క్ ప్రారంభం
అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర
పరిశీలించిన మంత్రి , కలెక్టర్, ఎస్పీ
పీసీపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని లింగన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పార్కు (ఎంఎస్‌ఎంఈ)ను సీఎం చంద్రబాబు మంగళవారం ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో క్షేత్రస్థాయి పనుల్లో నిమగ్నమ య్యారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి రేయింబవళ్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్ నిర్మాణం, స్టేజి ఏర్పాటు, పార్కింగ్ సౌకర్యాలు, సభకు వచ్చే ప్రజలకు వసతులు వంటి అంశాలపై ఆయన సమీక్ష చేశారు. సంబంఽధిత అధికారులకు తగు సూచనలు చేసి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి కావాలని సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్న నేపథ్యంలో వారికి అవసరమైన మౌలికవసతుల కల్పనపై అఽధికారులకు సూచనలు చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు హెలిప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టారు. సభావేదిక కోసం ఎంఎ్‌సఎంఈ ప్రాజెక్టులో ఉన్న జంగిల్‌ను డోజర్‌తో తొలగిస్తున్నారు. ఆదివారం మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజులు ఏర్పాట్లను పరిశీలించారు.