అద్దంకిటౌన్ హాల్ నిర్మాణానికి సన్నాహాలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 02:12 AM
పట్టణంలో టౌన్ హాల్ నిర్మించేందుకు అదానీ సంస్థ ముందుకు వచ్చింది.
అద్దంకి, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో టౌన్ హాల్ నిర్మించేందుకు అదానీ సంస్థ ముందుకు వచ్చింది. పట్టణంలోని భవానిసెంటర్‌లో 16 సెంట్ల స్థలంలో అద్దంకి టౌన్‌హాల్ నిర్మాణం చేయాలని పలువురు మంత్రి రవికుమార్ దృష్టికి తీసుకు పోయారు. ఈ నేపథ్యంలో రెండు అంతస్థులతో రూ.3.30 కోట్లతో ఆదాని సంస్థ సామాజిక బాధ్యతగా టౌన్‌హాల్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆదాని సంస్థల ప్రతినిధులు స్థల పరిశీలన చేశారు. అద్దంకి టౌన్ హాల్ నిర్మాణానికి రూ.3.30 కోట్లు మంజూరు చేసేందుకు ఆ సంస్థ ఉన్నత స్థాయి అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో పనులు కూడా ప్రారంభం కాను న్నాయి. గ్రౌండ్ ప్లోర్ లో ముందు వైపు పార్కింగ్‌కు వదిలి, డైనింగ్‌హాల్ నిర్మాణం చేయనున్నారు. మొద టి అంతస్థు లో 180 మంది కూర్చొనే విధంగా సీటింగ్ తో హాల్ నిర్మాణం చేయనున్నారు. నిర్మాణం పూర్తయిన తరువాత అద్దంకి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే విధంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు తక్కువ ఖర్చుతో వేడుకలు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎన్నో ఏళ్ళు గా ఎదురు చూస్తున్న అద్దంకి టౌన్ హాల్ నిర్మాణం ఎట్టకేలకు నెరవేరనుంది.