కొత్త టీచర్ల నియామకాలకు కసరత్తు
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:19 AM
మెగా డీఎస్సీలో పోస్టులకు ఎంపికైన కొత్త టీచ ర్లకు పాఠశాలలు కేటాయించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 623 మంది కొత్త టీచర్లకు స్థానాలు కేటాయించాల్సి ఉంది.
కమిషనర్ కార్యాలయానికి ఐటీ బృందం
ఒంగోలు విద్య, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో పోస్టులకు ఎంపికైన కొత్త టీచ ర్లకు పాఠశాలలు కేటాయించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 623 మంది కొత్త టీచర్లకు స్థానాలు కేటాయించాల్సి ఉంది. ఖాళీలను ధ్రువీకరించేందుకు రెండు రోజుల క్రితం ఉపవిద్యాధికారులు, మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించి కసర త్తును పూర్తిచేశారు. శనివారం సాయంత్రం మళ్లీ మరోసారి ఎంఈవోలను ఫోన్ ద్వారా సం ప్రదించి ఖాళీలను మళ్లీ ధ్రువీకరించుకున్నారు. జిల్లాలోని టీచర్ పోస్టుల ఖాళీల జాబితాలతో డీఈవో కార్యాలయం ఐటీ సెల్ సిబ్బంది సోమ వారం మంగళగిరిలోని పాఠశాల విద్య కమిషన ర్ కార్యాలయానికి రావాలని శనివారం పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డి ఆదేశించారు.
34 మంది టీచర్లకు నియామక ఉత్తర్వులు
బదిలీపై ఇతర జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చిన 34 మంది టీచర్లకు శుక్రవారం అర్ధరాత్రి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లాల నుంచి 21 మంది పరస్పర బదిలీల్లో, 13 మంది స్పౌజ్ కేటగిరీల్లో ఇక్కడికి వచ్చారు. వీరికి శుక్రవారం రాత్రి కౌన్సెలింగ్ నిర్వహిం చారు. 3వ కేటగిరీ పాఠశాలల్లోని ఖాళీల న్నింటినీ చూపించారు. ఇతర జిల్లాల్లో ఏ యా జమాన్యంలో పనిచేస్తూ ఇక్కడికి వచ్చారో వారికి ఇక్కడ కూడా అదే యాజమాన్యానికి నియామకపు ఉత్తర్వులు ఇచ్చారు. స్పౌజ్ కేటగిరీలో ఇక్కడకు వచ్చిన వారికి వారి స్పౌజ్ పనిచేస్తున్న స్థానానికి సమీపంలోని ఖాళీలను కేటాయించారు. కౌన్సెలింగ్‌లో టీచర్లు అప్షన్లు చూసి వారు కోరుకునే సమయానికి రాత్రి పొద్దుపోయింది.