Share News

శరన్నవరాత్రులకు సన్నద్ధం

ABN , Publish Date - Sep 22 , 2025 | 01:54 AM

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పలు ఆలయాలు ముస్తాబ వుతున్నాయి. పట్టణంలోని చక్రసహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

శరన్నవరాత్రులకు సన్నద్ధం

అద్దంకి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పలు ఆలయాలు ముస్తాబ వుతున్నాయి. పట్టణంలోని చక్రసహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల ఉత్సవాల ఆహ్వాన పుస్తకాన్ని ఆదివారం కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్య క్రమంలో అధ్యక్షులు ఊటుకూరి రామకోటేశ్వరరావు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చిన్ని లక్ష్మీశ్రీనివాసరావు, చుండూరి మురళీసుధాకర్‌, గార్లపాటి శ్రీనివాసరావు, కృష్ణసుభాన్‌, భోజనపల్లి సత్యనారాయణ, కురిచేటి వెంకటసుబ్బారావు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం గుండ్లకమ్మ నది నుంచి 108 మహిళలతో కళశాలతో జలాన్ని తీసుకొని దేవాలయం కు తీసుకు వస్తారన్నారు. అక్టోబరు 2వ తేదీ వరకు శరన్నవ రా త్రుల ఉత్సవాలు జరుగుతాయన్నారు. 4వ తేదీ అద్దంకి పట్టణంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారన్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అద్దంకి పట్టణంలోని పాతబస్టాండ్‌ నుంచి అమ్మవారి దేవాలయం వరకు విద్యుత్‌ దీపాలతో స్వాగత ద్వారాలు, దేవతామూర్తుల ఫోటోలు ఏర్పాటు చేశారు.

చినగంజాం : నేటి నుంచి నిర్వహించే దసరా శరన్నవరాత్రులకు మండల పరిధిలోని ఆలయాలను ముస్తాబు చేస్త్తున్నారు. చినగంజాంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరం, భవానీపురం, రైల్వే సెంటర్‌లోని విజయ కనకదుర్గాభవాని అమ్మవారి దేవస్థానం, సోపిరాల గ్రామంలోని లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వరస్వామి దేవస్థానం, కడవకుదురు గ్రామంలోని గంగా పార్వతి సమేత గోఖర్ణేశ్వరస్వామి దేవాలయం, సంతరావూరు, గొనసపూడి, రాజుబంగారుపాలెం, పెదగంజాం, చింతగుంపల్లి, పల్లెపాలెం తదితర గ్రామాల్లో సోమవారం నుండి అక్టోబరు 2 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు ప్రత్యేక అలంకరణలు, కుంకుమార్చనలు, కోలటాలు, భజనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు తెలిపారు. దేవాలయాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో అమ్మవార్లు భక్తులకు దర్శినమివ్వనున్నారు.

శ్రీమహాలక్ష్మమ్మ అమ్మకు పసుపు పూజా

వేటపాలెం (చీరాల) : వేటపాలెం మండలం అనుమల్లి పేట శ్రీమహాలక్ష్మమ్మ చెట్టువద్ద భక్తులు ఘనంగా పసుపు పూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ బతుకమ్మతల్లి ఉత్సవాలు సంద ర్భంగా నిర్వహించిన పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో అలంక రించి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యలక్ష్మీ, అనంత లక్ష్మీ, తులసీ, భారతీ, పార్వతీ, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

ముస్తాబైన ఆలయాలు

పర్చూరు : నేటి నుంచి నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు అవుతున్నాయి. ఆలయాలను శుభ్రపరిచి, విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. మండలంలో ని చెరుకూరు శ్రీ త్రివిక్రమ అగస్తేశ్వర ఆలయం, పర్చూరులోని శ్రీఅద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయం, శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి, అడుసుమల్లి, నాగులపాలెం, ఉప్పుటూరు, వీరన్నపాలెం, నూతల పాడు తదితర గ్రామాల్లోని ఆలయాలను వేడుకలకు సిద్ధం చేస్తున్నారు.

విద్యుత్‌దీపాలతో ఆలయాలు ముస్తాబు

పంగులూరు: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండలంలోని పలు ఆలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరించారు. పంగులూరులో స్వయంభూగా వెలసిన శ్రీ పార్వతీ సమేత శ్రీభీమ లింగేశ్వరస్వామి ఆలయంలో 22న సోమవారం నుంచి అక్టోబరు 2 వరకు శ్రీదేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి విఘ్నేశ్వరపూజ, స్వామి వారికి పంచామృత విశేషద్రవ్యములతో అభిషేక కార్యక్రమం, అమ్మవారికి ఖడ్గమాలార్చన అష్టోత్తరము జరుగుతుందని అర్చకస్వామి చందలూరి సునీల్‌ తెలిపారు.సాయంత్రం 6గంటల నుండి లలిత సహస్ర నామం పారాయణం, కుంకుమార్చనపూజ నిర్వహించి మంగళహారతి తీర్ధప్రసాద వినియోగం నిర్వహించను న్నట్లు తెలిపారు.

Updated Date - Sep 22 , 2025 | 01:54 AM