తెలుగువారి ఆత్మస్థైర్యానికి నిలువుటద్దం ప్రకాశం పంతులు
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:19 PM
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి ఆత్మస్థైర్యానికి నిలువుటద్దంలా నిలిచిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని, దేశ స్వాతంత్య్రం కోసం సమస్తం త్యాగం చేసిన దేశభక్తుడని ఆయన కొనియాడారు.
ఘనంగా ప్రకాశం పంతులు జయంతి
గిద్దలూరు టౌన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి ఆత్మస్థైర్యానికి నిలువుటద్దంలా నిలిచిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని, దేశ స్వాతంత్య్రం కోసం సమస్తం త్యాగం చేసిన దేశభక్తుడని ఆయన కొనియాడారు.
పట్టణంలో స్వచ్ఛాంధ్ర ర్యాలీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్వచ్ఛాంధ్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతినెలా 3వ శనివారం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుంచి స్వచ్ఛాం ధ్ర ర్యాలీ నిర్వహించరు. ర్యాలీలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ బైలడుగు బాలయ్య, కమిషనర్ ఇ.వి.రమణబాబు, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు సయ్యద్ షానేషావలి, కౌన్సిలర్లు, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా ప్రకాశం పంతులు జయంతి
మార్కాపురం వన్‌టౌన్ : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి స్థానిక వాసవి విద్యానికేతన్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రంగయ్య ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పించారు. జాతి గర్వించదగ తెలుగుబిడ్డ ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రంజిత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.