ఆధి.. పైత్యం..!
ABN , Publish Date - May 26 , 2025 | 10:59 PM
సాధారణంగా ఎవరైనా మా ఊరికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు.. ఏమీ చేయలేదని విసుర్లు విసురుతుంటారు.
సాధారణంగా ఎవరైనా మా ఊరికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు.. ఏమీ చేయలేదని విసుర్లు విసురుతుంటారు. కానీ తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెం తీరు అలా లేదు. ఆ గ్రామానికి స్వచ్ఛభారత్ కింద రూ.8 లక్షల విలువైన ట్రాక్టర్‌ను ప్రభుత్వం ఇచ్చింది. దానిని ఈ నెల 4న నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి మండల కార్యాలయంలో అందజేశారు. ఆ ఊరిలోని అధికార పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు వల్ల ఆ ట్రాక్టర్ కు డ్రైవర్ నియామకంలో ఏకాభిప్రాయం రాలేదు. దీంతో ఆ ట్రాక్టర్ మండల కార్యాలయంలో అలానే వదిలేశారు. ఇరవై రోజులకు పైగా ట్రాక్టర్ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్నా ఏ ఒక్కరిలోనూ చలనం లేదు. -తాళ్లూరు, ఆంధ్రజ్యోతి