బ్లాక్ మార్కెట్‌పై పోలీసుల కన్ను
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:25 AM
ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 121 ఎరువుల దుకాణాలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా 121 ఎరువుల దుకాణాలలో తనిఖీలు
అక్రమాలకు పాల్పడితే చర్యలు : ఎస్పీ దామోదర్
ఒంగోలు క్రైం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 121 ఎరువుల దుకాణాలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న సమాచారం తెలుసుకున్న ఎస్పీ తనిఖీలకు ఆదేశించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎరువుల షాపుల్లో రికార్డులు, నిల్వలను పరిశీలించారు. ఎక్కడా అవత వకలను గుర్తించిన దాఖలాలు కనిపించలేదు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.