వీరయ్య హత్య కేసు నిందితుడి ఇంట్లో పోలీసుల తనిఖీలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:19 PM
టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య కేసులోని నిందితుడైన అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన ఆళ్ల సాంబశివరావు(సిద్ధాంతి) ఇంట్లో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు బుధవారం తనిఖీలు చేపట్టారు.
నాగులుప్పలపాడు, జూన్25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య కేసులోని నిందితుడైన అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన ఆళ్ల సాంబశివరావు(సిద్ధాంతి) ఇంట్లో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు బుధవారం తనిఖీలు చేపట్టారు. వీరయ్యచౌదరి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సదరు కేసులోని పలువురు నిందితులకు, ఆళ్ల సాంబశివరావుకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ చెక్‌లు, ఖాతా వివరాలు, ప్రామిసరీ నోట్లు, పలు కీలకమైన పత్రాలను డీఎస్పీ పరిశీలించారు. ఆ కేసులో ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్న అదే గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, సిద్ధాంతి మేనల్లుడైన ముప్పా సురేష్ కుటుంబ సభ్యులను సైతం డీఎస్పీ విచారించారు. ఆయన వెంట ఎస్‌ఐ రజియాసుల్తానా, సంతనూలపాడు ఎస్‌ఐ అజయ్‌బాబు ఉన్నారు.