మొక్కలునాటి సంరక్షించాలి
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:05 AM
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లక్ష్మీనరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా మొ క్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ భూమిద ఉన్న సర్వ జీవరాసుల మనుగడకు మొక్కలే ప్రాణధారమని అన్నారు. పర్యావరణ పరిర క్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
పామూరు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లక్ష్మీనరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా మొ క్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ భూమిద ఉన్న సర్వ జీవరాసుల మనుగడకు మొక్కలే ప్రాణధారమని అన్నారు. పర్యావరణ పరిర క్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. పాఠశాలల్లో విరివిరిగా మొక్కలు నాటి ఉద్యనవనంలా తీర్చిదిద్దా లన్నారు. డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ మాట్లాడుతూ ఈఏడాది అటవీశాఖతో కలిసి 25 లక్షల మొక్కలను పెంచుతున్నట్టు చెప్పారు. వీటిని నాటేందుకు ఉచి తంగా అందజేస్తున్నామన్నారు. నాటిని మొక్కల సం రక్షణకు నిధులు కూడా అందజేస్తామని చెప్పారు. పొలాల్లో గట్లు వెంబడి, పంచాయతి స్థలాల్లో మొ క్కలు నాటాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద నియోజకవర్గంలో రూ.16 కోట్లతో సిమెంట్ రోడ్ల పనులు జరిగాయన్నారు. కార్యక్రమంలో రిలయన్స్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వెంకట్, టీడీపీ మండల, గ్రామ కమిటీ అధ్యక్షులు పు వ్వాడి వెంకటేశ్వర్లు, బత్తుల మస్తాన్‌రావు, ఎంపీటీసీ బొల్లా నరసింహారావు, సర్పంచ్ విజ య్‌శేఖర్, హెచ్‌ఎం సయ్యద్ ఈసాక్, ఎంపీడీవో ఎల్.బ్రహ్మ య్య, డీఆర్వో వెంకటసుబ్బ య్య, ఏపీడీ భాస్కరరావు, ఏపీ వో బి.మాల్యాద్రి, ఏపీఎం జి.వి ద్యాసాగర్, అడుసుమల్లి ప్రభా కర్‌చౌదరి, తదితరులు పాల్గొ న్నారు.
మండలంలోని దూబగుంట గ్రామంలో నిర్మించిన గ్రామ స చివాలయం, రైతుసేవా కేం ద్రం, హెల్త్‌క్లినిక్ కేంద్రాలతో పాటు రూ.3.10 కోట్ల నాబార్డు నిధులతో నిర్మాణం చేసిన తారు రోడ్డును ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్.బ్రహ్మయ్య, పంచా యతీరాజ్ ఏఈ మస్తాన్‌వలి, ఉపసర్పంచ్ కందుల శ్రీనువాసులు, దైండే శివశంకర్, బి.జయరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
దర్శి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని పరిర క్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నా రు. దర్శి-కురిచేడు రోడ్డులోని ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురు వారం ఆమె మొక్కలు నాటారు. ఈసందర్భంగా మా ట్లాడుతూ భావితరాల కోసం వృక్ష సంపదను పెం పొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కూట మి ప్రభుత్వం కోటి మొక్కల పెంపకాన్ని ప్రతిష్టాత్మ కంగా చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిర క్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంద న్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణమూర్తి, ఏ పీడీ లలితకుమారి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుల్లల చెరువు చిన్నా, రూరల్ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వ ర్లు, టీడీపీ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి, గుర్రం బాలకృష్ణ, కల్లూరి సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని శేషంవారిపాలెంలో శ్రీసీతారామ దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈకార్యక్రమంలో పా ల్గొని పూజలు చేశారు. ఈసందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే నారపుశెట్టి పాపారావు, సానె సుబ్బయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.
మానవాళి మనుగడకు మొక్కలు నాటాలి
ముండ్లమూరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మానవాళి మనుగడకు మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీ వో సునీత అన్నారు. గురువారం స్థానిక ఉపాధి హా మీ పథకం, వెలుగు కార్యాలయం వద్ద మొక్కలు నా టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్క రూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎ ల్.లక్ష్మీనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు కూర పాటి శ్రీనివాసరావు, ఏపీవో టి.వెంకటరావు, తదితరు లు పాల్గొన్నారు. మండలంలోని శంకరాపురంలో స ర్పంచ్ కూరపాటి మహేశ్వరి, నారాయణ స్వామి మొక్కలు నాటారు. ప్రతి సచివాలయం వద్ద సర్పం చ్‌లు, పంచాయతీ కార్యదర్శులు మొక్కలు నాటారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
దొనకొండ, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎం పీడీవో శ్రీదేవి పేర్కొన్నారు. స్థానిక బేతేల్‌పురం అంగ న్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భం గా మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షించడం వల్ల భవిష్యత్తు తరాలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతా యన్నారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహిం చారు. ఈసందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్య క్రమంలో ఎంఈవో సాంబశివరావు, ఎస్.వెంకటరావు, సుభాషిణి, గ్రేస్‌రత్నకుమారి, దేవానంద్, పొట్ల కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. స్థానిక కేజీబీవీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోడి ఆంజనేయులు, సర్పంచ్ గ్రేస్‌రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.