Share News

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

ABN , Publish Date - Nov 20 , 2025 | 10:24 PM

వన సంరక్షణతోనే భావితరాలకు ప్రాణవాయువు లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక కంభం రోడ్డులోని కనిగిరి నగరవనంలో గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
నగరవనంలో మొక్కనాటి మట్టి పోస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వన సంరక్షణతోనే భావితరాలకు ప్రాణవాయువు లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక కంభం రోడ్డులోని కనిగిరి నగరవనంలో గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యావరణ సమతులంగా ఉండి సకాలంలో వర్షాలు కురవాలంటే మొక్కలను ఎక్కువగా నాటాలన్నారు. చెట్ల ద్వారానే మానవుడికి తగినంతం ఆక్సి,జన్‌ లభిస్తుందని చెప్పారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటుచేసిన పార్కు ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు. పార్కును సందర్శించే వారికి సౌకర్యాల కల్పనతో పాటు నగరవనం అభివృద్ధికి మరింత చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం నగరవనంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్‌డీఎఫ్‌వో పి.శ్రీనివాసరావు, కనిగిరి ఎఫ్‌ఆర్‌వో పరమేశ్వరరెడ్డి, కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి, విద్యుత్‌ డీఈ ఉమాకాంత్‌, తహసీల్దార్‌ జయలక్ష్మి, ఎస్‌ఐ టి.శ్రీరాం, టీడీపీ మండల అధ్యక్షుడు కొండా కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్‌ పిరోజ్‌, సానికొమ్ము విజయభాస్కర్‌రెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, సుబ్రమణ్యం, వెంకటరెడ్డి, సామిల్‌ అహ్మద్‌, కనిగిరి, పీసీపల్లి, పామూరు, గుడిపాటిపల్లి, అంబవరం, డీజీపేట ఫారెస్ట్‌ డీఆర్‌వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 10:24 PM