Share News

మొక్కలే జీవనాధారం

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:18 PM

భవిష్యత్‌ తరాలకు జీవనాధారం మొక్కలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఆదివారం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా దేవరాజుగట్టులోని పాఠశాలలో ఆయన మొక్కలు నాటారు.

మొక్కలే జీవనాధారం
మొక్కలు నాటుతున్న ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

పెద్దారవీడు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : భవిష్యత్‌ తరాలకు జీవనాధారం మొక్కలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఆదివారం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా దేవరాజుగట్టులోని పాఠశాలలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడం సేవ కాదని రాబోయే తరాలకు మనం ఇస్తున్న కానుక అని అన్నారు. ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్‌ కోసం శ్రమిస్తుందని చెప్పారు. మొక్కలు పెంచటం ద్వారా మారుతున్న వాతావరణ పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించటంలో చెట్ల పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:18 PM