Share News

విద్యాలయ ప్రాంగణంలోనే ఎరువుల దిబ్బలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:43 AM

ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన సాగాలని ఒక వైపు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తుండ గా అద్దంకి పట్టణంలోని గొరకాయపాలెం హైస్కూల్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది.

విద్యాలయ ప్రాంగణంలోనే ఎరువుల దిబ్బలు

అద్దంకి, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి): ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన సాగాలని ఒక వైపు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తుండ గా అద్దంకి పట్టణంలోని గొరకాయపాలెం హైస్కూల్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఐదారు సంవత్సరాలుగా పరాయి పంచన నడిచిన హైస్కూల్‌ తరగతులు గత ఏడాది నుండి నిర్మాణంలో ఉన్న గదులలో నిర్వహిస్తు న్నారు. అయితే హైస్కూల్‌ ఆవరణను ఆ క్రమించి ఎరువుదిబ్బలు వేయడం అధికారులు మొక్కుబడిగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. పాఠశాలలో 150 మందికి పైగా విద్యార్థులు 5 నుండి 10వ తరగతి వరకు చదువుతున్నారు. విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపడుతు న్నారు. అయితే మరుగుదొడ్లులోకి వెళ్లే వీలు కూడా లేకుండా ఎరువు దిబ్బ వేయడం మరింత విమర్శలకు తావిస్తోంది. నిత్యం దుర్వాసన పీల్చుకుంటూ విద్యార్థులు విద్యా భ్యాసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పక్కనే మండల విద్యాశాఖ అధికారులు కార్యాలయం కూడా ఉంది. ఇక నిత్యం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించే మున్సిపల్‌ అధికారులు సైతం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. పాఠశాల ఆవరణలో ఎరువు దిబ్బలు వేసిన ప్పటికి రెవెన్యూ అధికారులు స్పందించక పోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో డెంగ్యూ జ్వరాలు, విషజ్వరాలు విలయ తాండవం చేస్తున్న తరుణంలో పాఠశాల ఆవరణలో ఇలా అపరిశుభ్రంగా ఉండే వ్యాధులు ప్రబలవా..? మరి అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాథికారులు స్పందించి పాఠ శాల ఆవరణలో ఉన్న ఎరువు దిబ్బలు తొల గించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Updated Date - Aug 12 , 2025 | 01:43 AM