Share News

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:22 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పీ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై స్పందించిన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
మీకోసంలో అర్జీదారు సమస్యపై మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌,డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పీ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై స్పందించిన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ప్రతిఆర్జీని సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూఅధికారి చిన ఓబులేశు, స్పెషల్‌ డి ప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, కుమార్‌, జాన్సన్‌, కళావతి, విజయజ్యోతితో పాటు పలుశాఖల అధికారులు ఉన్నారు.

భారీగా వచ్చిన దరఖాస్తులు

మీకోసం కార్యక్రమంలో ప్రజలనుంచి భారీగా అర్జీలు వచ్చాయి. మొత్తం 399 అర్జీలు రాగా అందులో 146 అర్జీలు రెవెన్యూ అంశాలపైనే వచ్చాయి. ఇతర సమస్యలపై 253 వచ్చాయి. సోమవారం రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించగా ఈ క్లినిక్‌లో ఒకే రోజు 146 అర్జీలు వచ్చాయంటే రెవెన్యూ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Dec 30 , 2025 | 01:22 AM