Share News

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:47 PM

ప్రజలనుంచి వస్తున్న అర్జీలు పునరావృతంకాకుండా అధికారులు సత్వరమే పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను విన్నవించారు. తన పరిధిలో ఉన్న అర్జీలన ువీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
మీకోసంలో అర్జీదారులతో మాట్లాడుతున్న జేసీ గోపాలకృష్ణ

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ప్రజలనుంచి వస్తున్న అర్జీలు పునరావృతంకాకుండా అధికారులు సత్వరమే పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను విన్నవించారు. తన పరిధిలో ఉన్న అర్జీలన ువీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలించారు. మరికొన్నింటిపై విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల నుంచి అర్జీలు పునరావృతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 227 అర్జీలు ఆయాశాఖలలో పునరావృతం అయ్యాయన్నారు. నిబంధనల ప్రకారం సరైనవో కావో పరిశీలించాలన్నారు. లేకుంటే అర్జీదారులకు వివరించాలని తెలిపారు గడువు మీరిన అర్జీలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కళావతి,స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్‌, మాఽధురి, విజయ జ్యోతి కుమారి తదితరులు ఉన్నారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 105 ఫిర్యాదులు

ఒంగోలు క్రైం : ప్రజాసమస్యల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సత్యరమే విచారించి చట్టపరిధిలో పరిష్కరించాలని ఎస్పీవి.హర్షవర్ధనరాజు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 105 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా పోలీసు కారాల్యయానికి రాలేని వారు సంబంధిత పోలీసు స్టేషన్‌, సర్కిల్‌ కార్యాలయం, సబ్‌డివిజన్‌ కార్యాలయంలో ఫిర్యాదులు చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ వీవీ రమణకుమార్‌, సీఐలు శ్రీకాంత్‌ బాబు, వెంకటేశ్వర్లు,సుబ్బారావు, సోమశేఖర్‌ ఎస్‌ఐ జనార్దనరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 11:47 PM