Share News

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:21 AM

మీకోసంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్‌ అన్సారియా అర్జీలను స్వీకరించారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
మీకోసంలో అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : మీకోసంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్‌ అన్సారియా అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రీ ఓపెన్‌ కాకుండా సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై ప్రతిశాఖలో ఆడిట్‌ టీంలతో పాటు నోడల్‌ అధికారిని ఏర్పాటు చేశామని, ఆ ఆడిట్‌లో పెండింగ్‌ లేకుండా చూసుకోవాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించి డాక్యుమెంట్స్‌ను ఈపీటీఎ్‌స వెబ్‌సైట్‌లో రోజూ ఆప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఒబులేషు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, వరకుమార్‌, జాన్సన్‌తో పాటు పలుశాఖల అధికారులు ఉన్నారు.

ఫ 2008 డీఎస్సీ గ్రేడ్‌-2 తెలుగు పండిట్‌ రోస్టర్‌ కం మెరిట్‌ జాబితాలో అక్రమాలపై సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితిరాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం కోరారు.ఈమేరకు మీకోసంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి న్యాయంచేయాలని కోరారు.

Updated Date - Sep 02 , 2025 | 12:21 AM