వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:03 PM
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శనివారం వెలిగండ్ల జిల్లాప రిషత్ ఉన్నత పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు వ్యక్తిగత పరి శుభ్రతను అలవాటుగా మార్చడం, క్రమశిక్షణ, ఆత్వ విశ్వాసం పెంపొందించడం ముస్తాబు లక్ష్యమన్నారు.
విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర సూచన
చేతుల శుభ్రత గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర
వెలిగండ్ల, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శనివారం వెలిగండ్ల జిల్లాప రిషత్ ఉన్నత పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు వ్యక్తిగత పరి శుభ్రతను అలవాటుగా మార్చడం, క్రమశిక్షణ, ఆత్వ విశ్వాసం పెంపొందించడం ముస్తాబు లక్ష్యమన్నారు. పాఠశాలకు ఆటస్థలం కల్పించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అర్ధంతరంగా అదనపు తరగతి గదుల నిర్మాణాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, ఎంపీపీ రామన మహాలక్ష్మి, జడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి, ఎంఈవో దాసు ప్రసాద్, ప్రధానోపాధ్యా యురాలు గౌసియా బేగం, టీడీపీ నాయకులు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, కేలం ఇంద్ర భూపాల్‌రెడ్డి, బీరం వెంకటేశ్వర రెడ్డి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పీసీపల్లి: ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన ముస్తా బు కార్యక్రమాన్ని శనివారం పీసీపల్లి ప్రభుత్వ పాఠశాలలో అధికారులు లాంఛనంగా ప్రా రంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో జీవీ కృష్ణా రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంలో ముస్తాబు కార్యక్రమం కీలక పాత్ర వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు సంజీవి, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముండ్లమూరు: విద్యార్థులకు చదువుతో పాటు ఆరో గ్యం ముఖ్యమని మండల ప్రత్యేకాధికారి సీహెచ్ శ్రీని వాసులు అన్నారు. శనివారం స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన ముస్తాబు కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.శ్రీదేవి, సునీత తదితరులు పాల్గొన్నారు.