Share News

ఉపాధి బిల్లుల చెల్లింపునకు అనుమతి

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:26 PM

నియోజకవర్గంలో ని ఐదు మండలాలలో ఉపాధి హామీ పథకం నిధులతో 2014 నుంచి 2019 వరకు చేసిన పనులకు బిల్లులు చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు.

ఉపాధి బిల్లుల చెల్లింపునకు అనుమతి
అధికారులతో సమావేశమైన ఎరిక్షన్‌బాబు

2014-19 వరకు చేసిన పనులకు నగదు అందని వారు వివరాలు ఇవ్వాలి

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో ని ఐదు మండలాలలో ఉపాధి హామీ పథకం నిధులతో 2014 నుంచి 2019 వరకు చేసిన పనులకు బిల్లులు చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు. బుధవారం ఉపాధి హామీ ఏపీవోలు, పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు, గ్రా మీణ తాగునీటి పథకం ఇంజనీర్లు, ఎంపీడీవోలతో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఎరిక్షన్‌బాబు మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు ఉపాధి నిధులతో నీటి కుంటల నిర్మాణం, చెక్‌ డ్యాంల నిర్మాణం, శ్మశానాల అభివృద్ధి పనులను టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లరకు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా బిల్లులు చెల్లించలేదన్నారు. పనులు చేసిన వారు నష్టపోకుండా ప్రజా ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. వారంలోగా పనులు చేసి బిల్లులు అందని వారు పూర్తి వివరాలను సంబంధిత శాఖల అధికారులకు అందజేయాలని ఎరిక్షన్‌బాబు సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఐదు మండలాల ఏపీవోలు, పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు, ఉపాధి టెక్నికల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 11:26 PM