143 బాణ సంచా షాపులకు అనుమతి
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:38 AM
దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లాలో బాణసంచాను విక్రయించుకునేందుకు 143 షాపులకు అధికారులు అనుమతి ఇచ్చారు. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో షాపుల నిర్వహణకు 216 దరఖాస్తులు రాగా అందులో 73 తిరస్కరించారు.
సరైన పత్రాలు లేకపోవడంతో 73 దరఖాస్తులు తిరస్కరణ
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లాలో బాణసంచాను విక్రయించుకునేందుకు 143 షాపులకు అధికారులు అనుమతి ఇచ్చారు. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో షాపుల నిర్వహణకు 216 దరఖాస్తులు రాగా అందులో 73 తిరస్కరించారు. ఒంగోలు డివిజన్‌లో 98 దరఖాస్తులు రాగా 80 షాపులకు అనుమతి ఇచ్చారు. కనిగిరి డివిజన్‌లో 57 దరఖాస్తులకు కేవలం ఐదింటికి మాత్రమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మార్కాపురం డివిజన్‌లో 61 దరఖాస్తులు రాగా 58 షాపులకు అనుమతి ఇచ్చారు.