వైసీపీ అబద్ధాలను ప్రజలు నమ్మరు
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:00 PM
నకిలీ మద్యం అంటూ వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, నకిలీ మద్యానికి మూల విరాట్ జగన్‌రెడ్డి అండ్ కో అని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కల్తీ మద్యం అమ్మి నకిలీ బ్రాండ్‌లతో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఇప్పుడు నకిలీ మద్యంపై మాట్లాడడం విడ్డూరమన్నారు.
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
త్రిపురాంతకం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : నకిలీ మద్యం అంటూ వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, నకిలీ మద్యానికి మూల విరాట్ జగన్‌రెడ్డి అండ్ కో అని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కల్తీ మద్యం అమ్మి నకిలీ బ్రాండ్‌లతో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఇప్పుడు నకిలీ మద్యంపై మాట్లాడడం విడ్డూరమన్నారు. ఇటీవల కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారని మరి వైసీపీలో కేసులు నమోదై జైలు పాలైన వ్యక్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కల్తీ మద్యం కుంభకోణం వెలికి తీసేందుకు నలుగురు ఐపీఎ్‌సలతో సిట్ వేశామని, తప్పు చేసిన వారిపై తప్పక చర్యలు ఉంటాయని ఎరిక్షన్‌బాబు ఆప్రకటనలో తెలిపారు.