పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:24 AM
తగ్గించిన అడిషనల్ క్యాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని, 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని ఏపీఎన్‌జీవో భవన్‌లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా సర్వసమావేశం జిరిగింది. ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు బడే అంకిరెడ్డి అధ్యక్షత వహించారు
ఒంగోలు(రూరల్),డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): తగ్గించిన అడిషనల్ క్యాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని, 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని ఏపీఎన్‌జీవో భవన్‌లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా సర్వసమావేశం జిరిగింది. ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు బడే అంకిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈసమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 11వ పీఆర్సీ అరియర్స్,డీఆర్ అరియర్స్ విడతల వారీగా ఇవ్వాలన్నారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభుదాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు ఈహెచ్‌ఎ్‌స కార్డులు కొన్ని వైద్యశాలలో ఉపయోగపడటంలేదన్నారు. జిల్లా ట్రెజరీ అధికారి జగన్నాధరావు మాట్లాడుతూ పెన్షనర్‌ల సమస్యలు ఎప్పటికప్పడు పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో ఎస్‌టీవో కృష్ణ, ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రమణయ్య, జిల్లా ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు కె.శరత్‌బాబు,కార్యదర్శి ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డిలు ప్రసంగించారు. అనంతరం 75 సంవత ్సరాలు దాటిన ప్రభుత్వ పెన్షన్‌దారులను శాలువాలతో, మెమెంటోలతో సన్మానించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లాకార్యదర్శి డాక్టర్ కంచర్ల సుబ్బారావు, రాష్టప్రభుత్వ పెన్షన్‌దారులు పాల్గొన్నారు .
నూతన కార్యవర్గం ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బడే అంకిరెడి,సహాయ అధ్యక్షుడిగా రామకృష్ణ, కార్యదర్శిగా డాక్టర్ కంచర్ల సుబ్బారావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా మన్నం హనుమంతరావు, కోశాధికారులుగా జి.రామకోటేశ్వరరావు, ప్రభాకరరావు, జిల్లా గౌరవాధ్యక్షుడిగా వి.పున్నయ్య మరో ఆరుగురిని ఉపాద్యక్షులుగాను, ఇంకో ఆరుగురిని సంయుక్తకార్యదర్శులుగాను, 14మందిని కార్యవర్గసభ్యులుగా ముగ్గురిని సలహాదారులుగా ఎన్నుకున్నారు.