Share News

పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేయాలి

ABN , Publish Date - May 18 , 2025 | 11:31 PM

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు

పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రావు

ఒంగోలు విద్య, మే 18 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు టీఎల్‌ కాంతారావు అధ్యక్షత వహించారు. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి ఐఆర్‌ను ప్రకటించాలని, ఏకీకృత సర్వీసు రూల్స్‌ అమలు చేయాలని,పదో తరగతి పరీక్షలకు సంబంధించిన రెన్యూమరేషన్‌ టీఏ, డీఏలు చెల్లించాలని, వేసవి సెలవుల్లో పనిచేసిన హెచ్‌ఎంలకు ఎర్న్‌ లీవ్‌ మంజూరు చేయాలని కోరారు. ఎంఈవో-1 ఖాళీ అయిన మండలాల్లో అక్కడి సీనియర్‌ హెచ్‌ఎంలకు ఇన్‌చార్జిలుగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి వై. వెంకట్రావు, డీసీఈబీ కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు, కోశాధికారి జీఎ్‌సఆర్‌ సాయి, హెచ్‌ఎంలు ఎ. వెంకటేశ్వర్లు, కే శ్రీనివాసరావు, పీఎ పద్మనాభరావు, పీఎం ఖాన్‌ ఉన్నారు.

Updated Date - May 18 , 2025 | 11:31 PM