పంగులూరులో పీడీసీసీ బ్యాంక్ శాఖ ఏర్పాటు
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:04 PM
పంగులూరు కేంద్రంగా కోఆపరేటివ్ బ్యాంక్ శాఖ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడతామని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య చెప్పారు.
పంగులూరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి) : పంగులూరు కేంద్రంగా కోఆపరేటివ్ బ్యాంక్ శాఖ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడతామని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య చెప్పారు. మండలంలోని తూర్పు కొప్పెరపాడు పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం రాత్రి కొప్పెరపాడు గ్రామంలో జరిగింది. పీఏసీఎస్ చైర్మన్‌గా గొల్లపూడి అంజయ్య, సభ్యులుగా కోమటి ప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సీతారామయ్య మాట్లాడుతూ జిల్లా బ్యాంక్ పరిధిలో ఇప్పటివరకు 3,500 కోట్లరూపాయల వ్యాపారం జరుగుతున్నట్లు తెలిపారు. 2,500 కోట్ల డిపాజిట్లు కలిగి ఉన్నాయన్నారు. వ్యాపారాన్ని 4వేల కోట్లకు పెంచానే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రావినూతల బ్యాంక్ మేనేజర్ పఠాన్ రెహమాన్, పూనాటి రామాంజనేయులు, కె.వి.సుబ్బారావు, ిసీఈవో వేణుబాబు, రావూరి రమేష్, కుక్కపల్లి ఏడుకొండలు, శేఖర్, సహదేవుడు, పీఏసీఎస్ అధ్యక్షులు బ్రహ్మానందస్వామి, చిలుకూరి కోటయ్య, బెల్లంకొండ శ్రీధర్, మద్దినేని కోటేశ్వరరావు, ఎనికపాటి శ్రీనివాసరావు, పెండ్యాల సుబ్బారావు, నాదెండ్ల నరసింహారావు, ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.