పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:15 PM
పెండింగ్‌లో ఉన్న కమిటీలను వెంటనే పూర్తి చేయాలని టీడీపీ సంస్థాగత కమిటీల నియోజకవర్గ పరిశీలకుడు ఎన్‌ఎమ్‌డీ ఫిరోజ్ అన్నారు.
మార్కాపురం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్‌లో ఉన్న కమిటీలను వెంటనే పూర్తి చేయాలని టీడీపీ సంస్థాగత కమిటీల నియోజకవర్గ పరిశీలకుడు ఎన్‌ఎమ్‌డీ ఫిరోజ్ అన్నారు. జవహర్‌నగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ సంస్థాగత కమిటీల నియోజకవర్గ పరిశీలకులు ఫిరోజ్ మాట్లాడుతూ పార్టీ కమిటీలను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలన్నారు. ఏవైనా పెండింగ్‌లుంటే నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అందరినీ సమన్వయపరిచి వెంటనే కమిటీలను వేసుకోవాలన్నారు. పార్టీ కోసం కస్టపడి పనిచేసిన వారికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్టీ కోసం శ్రమించిన వారికి తప్పక గుర్తింపు లభిస్తుందనే భరోసా వారికి ఇవ్వాలన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ని యోజకవర్గ పోల్‌మేనేజిమెంట్ క్లస్టర్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా కష్టపడి పనిచేయడంవల్లే 2024లో పార్టీ అధికారంలోకి వ చ్చిందన్నారు. కార్యకర్తల సేవలను చంద్రబాబు ఎన్నికటికీ మరువరన్నారు. కార్యక్రమంలో మాలపాటి వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీంఖాన్, మైనార్టీ నాయకులు పఠాన్ హుసేన్‌ఖాన్, గులాబ్ పాల్గొన్నారు.