Share News

పంచాయతీ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:39 PM

గ్రామ పంచాయతీలను ఆదాయ వపరులు గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందని జిల్లా పంచాయతి అధికారి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని కోడిగుంపుల, పామూరు పంచాయతిల్లోని చెత్తనుంచి సంపద కేంద్రాలను గురువారం పరిశీలించారు.

పంచాయతీ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి
మాట్లాడుతున్న డీపీవో వెంకటేశ్వరరావు

పామూరు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలను ఆదాయ వపరులు గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందని జిల్లా పంచాయతి అధికారి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని కోడిగుంపుల, పామూరు పంచాయతిల్లోని చెత్తనుంచి సంపద కేంద్రాలను గురువారం పరిశీలించారు. అనంతరం మండలపరిషత్‌ కార్యాల యంలో పంచాయతి కార్యదర్శులతో జరిగిన సమావే శంలో ఆయన మాట్లాడారు. కార్యదర్శులు క్షేత్రస్థాయి లో అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధిపై శ్రద్ధ పెట్టా లన్నారు. స్వామిత్ర సర్వేలో తప్పులు దొర్లకుండా చూ డాలన్నారు. త్వరలో ప్రజల ఆస్తులకు సంబంధించి స్మార్ట్‌ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో సిబ్బంది పనితీరు, సమయపాలనపై దృష్టి సారించి గాడిలో పెట్టాలని డిప్యూటీ ఎంపీడీవో ఆలీని ఆదేశించారు. అనంతరం స్థానిక ఎస్సీ కాలనీలో ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో ఎల్‌. బ్రహ్మయ్య, డిప్యూటీ ఎంపీడీవోలు షేక్‌ హ జరత్‌అలీ, సుందరరామయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వై.రమేష్‌, టీడీపీ మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, యారవ శ్రీను, ఇర్రి కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అలాగే, సీఎస్‌పురం మండలంలోని ఆనికాలపల్లిలో డీపీవో వెంకటేశ్వరరావు పర్యటించారు. అక్కడ అపరిశు భ్రంగా ఉన్న నీటి ట్యాంకులను పరిశీలించి అసంతృప్తి వ్వక్తం చేశారు. తదనంతరం మండల పరిషత్‌ కార్యాల యంలో కార్యదర్శులతో జరిగిన సమావేశంలో పలుసూ చనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి.ప్రతాప్‌ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో వెంకటరమణయ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 11:39 PM