విద్యుత్తు షాక్ తగిలి పెయింటర్ మృతి
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:43 PM
విద్యుత్తు షాక్ తగిలి పెయింటింగ్ పనిచేసే ఒడిస్సాకు చెందిన కపిలాస్ బేహేర(27) మృతి చెందాడు
ఒంగోలు క్రైం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్తు షాక్ తగిలి పెయింటింగ్ పనిచేసే ఒడిస్సాకు చెందిన కపిలాస్ బేహేర(27) మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక ఎన్‌జీవో కాలనీలోని వెంకటేశ్వరనగర్‌లో గల శ్రీనివాసరావు అపార్ట్‌మెంట్ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. బేహేర ప్రస్తుతం పేర్నమిట్టలో నివాసం ఉంటూ పెయింట్ పనులు చేస్తున్నాడు. అపార్ట్‌మెంట్ కాంపౌండ్‌వాల్‌కు రంగు పూస్తున్న బేహేరకు అక్కడే ఉన్న విద్యుత్తు ట్రాన్ప్‌ఫార్మ్‌ర్‌కు పెయింట్ వేస్తున్న రోలర్ తగలడంతో షాక్ కొట్టి సృహ కోల్పోయాడు. వెంటనే రిమ్స్‌కు తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.