కోలాహలంగా..
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:27 AM
‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం సందర్భంగా జిల్లావ్యాప్తంగా కోలాహలంగా కార్యక్రమాలను నిర్వహించారు. ఆటోలతో ర్యాలీలు చేపట్టారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా ఆటోవాలాల ర్యాలీలు, పలుచోట్ల సభలు
ఒంగోలులో పాల్గొన్న ఇన్‌చార్జి మంత్రి ఆనం, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే జనార్దన్
ఇతర చోట్ల ముఖ్య నేతలు హాజరు
సీఎం చంద్రబాబు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం
‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం సందర్భంగా జిల్లావ్యాప్తంగా కోలాహలంగా కార్యక్రమాలను నిర్వహించారు. ఆటోలతో ర్యాలీలు చేపట్టారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు నుంచి మినీస్టేడియం వరకు భారీ ఆటో ర్యాలీ జరగ్గా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వయంగా ఆటోను నడిపారు. అందులో మంత్రి ఆనం, ఎంపీ మాగుంట కూర్చొని ఉత్సాహపరిచారు. అనంతరం మినీ స్టేడియంలో నిర్వహించిన సభలో వారు పాల్గొన్నారు. జిల్లాలో 11,356 మంది లబ్ధిదారులకు రూ.17.03కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించి నమూనా చెక్కును ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులకు అందజేశారు.
ఒంగోలు, అక్టోబరు. 4 (ఆంధ్రజ్యోతి) : ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం జిల్లావ్యాప్తంగా శనివారం సందడిగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఆటో డ్రైవర్లు ర్యాలీలు చేపట్టారు. పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15వేల చొప్పున రాష్ట్రప్రభుత్వం శనివారం వారి ఖాతాలలో జమ చేసింది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రారంభించగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలకు ప్రభుత్వం ఆ నిధులను జమచేస్తున్నప్పటికీ స్థానికంగా ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. విజయవాడలో సీఎం పాల్గొన్న సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాట్లను రవాణా శాఖ ఆధ్వర్యంలో చేశారు. జిల్లాలోని ప్రధాన కేంద్రాలలో ఈ సందర్భంగా ఆటోలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల నేతలు, అధికారులు ఖాకీ చొక్కాలు ధరించి పాల్గొన్నారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌లు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు నుంచి మినీ స్టేడియం వరకు భారీ ఆటో ర్యాలీ జరగ్గా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వయంగా ఆటోను నడిపారు. అందులో మంత్రి ఆనం, ఎంపీ మాగుంట కూర్చొని ర్యాలీలో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు. అనంతరం మినీస్టేడియంలో సభను నిర్వహించగా జిల్లాలో ఈ పథకం కింద 11,356 మంది లబ్ధిదారులకు రూ.17.03కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించి అందుకు సంంధించిన చెక్‌ను ఆటోడ్రైవర్ల సంఘం ప్రతినిధులకు అందజేశారు. మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. గిద్దలూరులో జరిగిన ర్యాలీలో అక్కడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి భాగస్వాములయ్యారు. ఆయన స్వయంగా ఆటో నడిపారు. కనిగి రిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొన్నారు. అలాగే దర్శిలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితోపాటు డీసీసీబీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు భాగస్వాములయ్యారు. వైపాలెంలో జరిగిన ర్యాలీలో అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీలు పాల్గొన్నారు