Share News

కొనసాగుతున్న పీహెచ్‌సీ వైద్యుల ఆందోళన

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:20 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారుల సమ్మె జిల్లాలో కొనసాగుతోంది. సమస్యలను పరిష్క రించాలని కోరుతూ ఆంధ్రపదేశ్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు జిల్లాలోని 64 పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న 138 మంది వైద్యాధికారులు ఆందోళనబాట పట్టారు.

కొనసాగుతున్న పీహెచ్‌సీ వైద్యుల ఆందోళన

చలో విజయవాడకు తరలిన వైద్యాధికారులు

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారుల సమ్మె జిల్లాలో కొనసాగుతోంది. సమస్యలను పరిష్క రించాలని కోరుతూ ఆంధ్రపదేశ్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు జిల్లాలోని 64 పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న 138 మంది వైద్యాధికారులు ఆందోళనబాట పట్టారు. గతనెల 26న సమ్మె నోటీసు ఇచ్చిన అసోసియేషన్‌ నాయకులు 27వ తేదీ నుంచి ఆందోళన చేపట్టారు. అయితే వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆయా సమస్యలపై పలు పర్యాయాలు చర్చలు జరిపినా విఫలమయ్యాయి. వైద్యాధికా రులు సమ్మె చేపట్టేందుకే నిర్ణయించారు. అందులోభాగంగా శనివారం చలో విజయవాడ పేరుతో నిర్వహించిన ధర్నాకు జిల్లా నుంచి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైద్యాధికారులు తరలివెళ్లారు. అక్కడ ధర్నాలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని నినదించారు.

Updated Date - Oct 05 , 2025 | 01:20 AM