Share News

ఒక్కరోజు.. ముగ్గురు మంత్రులు.. నాలుగు కార్యక్రమాలు

ABN , Publish Date - May 13 , 2025 | 02:11 AM

జిల్లాకేంద్రమైన ఒంగోలులో సోమ వారం కీలక ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి అధికార పార్టీకి చెందిన వారు రోజంతా బిజీబిజీగా గడిపారు. ఏకంగా ముగ్గురు మంత్రులతోపాటు జిల్లా నుంచి వివిధ చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్య ప్రజాప్రతిని ధులంతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డీఆర్సీ సమావేశం అనంతరం అదే హాలులో ప్రస్తుత పొగాకు మార్కెట్‌ తీరుపై ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి సమీక్షించారు.

ఒక్కరోజు.. ముగ్గురు మంత్రులు.. నాలుగు కార్యక్రమాలు
పొగాకు రైతులు, వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రవికుమార్‌, పక్కన మరో మంత్రి స్వామి

ఇన్‌చార్జి మంత్రి ఆనం నేతృత్వంలో డీఆర్సీ సమావేశం

తాగునీటి ఇక్కట్లు, ఉపాధి పథకంలో లోపాలపై చర్చ

పొగాకు మార్కెట్‌పై మంత్రులు గొట్టిపాటి, డోలా సమీక్ష

రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి

బిజీబిజీగా కీలక ప్రజాప్రతినిధులు

ఒంగోలు, మే 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకేంద్రమైన ఒంగోలులో సోమ వారం కీలక ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి అధికార పార్టీకి చెందిన వారు రోజంతా బిజీబిజీగా గడిపారు. ఏకంగా ముగ్గురు మంత్రులతోపాటు జిల్లా నుంచి వివిధ చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్య ప్రజాప్రతిని ధులంతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డీఆర్సీ సమావేశం అనంతరం అదే హాలులో ప్రస్తుత పొగాకు మార్కెట్‌ తీరుపై ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి సమీక్షించారు. పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌, ఈడీ విశ్వశ్రీలతోపాటు ప్రధానమైన పొగాకు కంపెనీల ప్రతినిధులు, వివిధ వేలంకేంద్రాల రైతుప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం మార్కెట్లో ధరలు, వ్యాపారుల తీరుపై రైతు ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలతోపాటు వేగంగా కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు ఉన్న ప్రతికూల పరిస్థితులను కంపెనీల ప్రతినిధులు వివరించారు. రైతులు నష్టపోకుండా కొనుగోళ్లు చేయాలని మంత్రులు సూచించారు. అందుకు బోర్డు అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఉదయం ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడు వద్ద టీడీపీ నేత, హర్షిణి విద్యాసంస్థల అధిపతి గోరంట్ల రవికుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మహిళా ఇంజనీరింగ్‌ కాలేజీని మంత్రులు గొట్టిపాటి, స్వామి ప్రారంభించారు. అనంతరం స్థానిక రంగారాయుడు చెరువు సమీపంలో నూతనంగా రూ.కోటితో నిర్మించిన దేవదాయ, ధర్మాదాయశాఖ జిల్లా కార్యాలయాన్ని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డాక్టర్‌ స్వామి ప్రారంభించారు. మంత్రుల కార్యక్రమాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమార్‌, ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, నారాయణరెడ్డి, దామచర్ల, సత్య, నూకసాని బాలాజీ, కలెక్టర్‌ అన్సారియా, జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు. అలాగే డీఆర్సీ సమావేశానికి వైసీపీకి చెందిన జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖర్‌లు కూడా హాజరై తమ ప్రాంత సమస్యలను ఏకరువు పెట్టారు. టీడీపీ దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జిలు డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, గుడూరి ఎరిక్షన్‌బాబుకూడా పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 02:11 AM