Share News

ఒక్క రోజు.. ఐదు వేల మొక్కలు

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:42 AM

ఒంగోలు నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మరో బృహత్తర కార్య క్రమానికి శ్రీకారం చుడుతున్నా రు. నగరంలో ఒక్క రోజునే ఏకంగా ఐదువేల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొం దించారు. అందుకు ఈనెల 24న ముహూర్తంగా నిర్ణయించారు.

ఒక్క రోజు.. ఐదు వేల మొక్కలు
ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయంలో సిద్ధంగా ఉన్న ఒక రకం మొక్కలు

భారీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జనార్దన్‌ కార్యాచరణ

ఈనెల24న ముహూర్తం

ప్రధాన రోడ్ల పక్కన ప్రాధాన్యం

ప్రభుత్వ స్థలాల్లోనూ నాటే కార్యక్రమం

పాల్గొననున్న మంత్రులు ఆనం, స్వామి, ఎమ్మెల్యేలు

ఒంగోలు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మరో బృహత్తర కార్య క్రమానికి శ్రీకారం చుడుతున్నా రు. నగరంలో ఒక్క రోజునే ఏకంగా ఐదువేల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొం దించారు. అందుకు ఈనెల 24న ముహూర్తంగా నిర్ణయించారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షణలో వేలాది మంది ఇంజనీరింగ్‌, ఇతర విద్యార్థులతో ఈ మొక్కలన్నింటినీ నాటించనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏ ప్రాంతంలో ఎలా అన్న ప్రణాళిక కూడా రూపొందించారు. నగరంలో అభివృద్ధి పనులు చేపట్టడంలో గతంలోనే మంచిపేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే జనార్దన్‌ ఈసారి అధికారంలోకి వచ్చాక జిల్లాకేంద్రమైన నగర సుందరీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏడాది కాలంగా నగరంలో కీలక రోడ్ల విస్తరణ, ప్రధాన మురుగు కాలువలతోపాటు వివిధ ప్రాంతాల్లో రోడ్లు, కాలువల పరిశుభ్రతపై దృష్టిపెట్టారు. కొన్ని ప్రధాన రోడ్లలో డివైడర్లపై మొక్కల పెంపకం, బొమ్మల ఏర్పాటు, పార్కుల్లో ఆహ్లాదకర వాతావరణం వంటి పనులు చేపట్టారు. వాటిని కొనసాగిస్తూనే తాజాగా నగరంలో పచ్చదనం పెంపు అవసరాన్ని గుర్తించి తదనుగుణ చర్యలు చేపట్టారు.

పచ్చదనం కోసం ప్రణాళిక

నగరంలోని ప్రధాన నగరాలకు ఇరువైపులా, డివైడర్లు, ప్రభుత్వ స్థలాల్లోనూ విస్తారంగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. కార్పొరేషన్‌ అధికారులతో ప్రణాళిక తయారు చేయించారు. అందులో భాగంగా ఈనెల 24న ఒకే రోజు ఐదువేల మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వివిధ రకాల మొక్కలను కడియం, ఇతర ప్రాంతాల నర్సరీల నుంచి తెప్పించి కార్పొ రేషన్‌ కార్యాలయంలో సిద్ధంగా ఉంచారు. ఆరో జున జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారా యణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంటతోపాటు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.

Updated Date - Oct 19 , 2025 | 01:42 AM