ఒక్కరోజు... 729 గ్రామ సభలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 02:46 AM
జిల్లావ్యా ప్తంగా శనివారం ఉపాధి హామీ పథకం గ్రామసభలు విజయవంతంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కరోజే 729 పంచాయతీలలో వీటిని నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఆ శాఖ పర్యవేక్షణ అధికారి నుంచి క్షేత్ర స్థాయిలోని ఫీల్డ్ అసిస్టెంట్ వరకు వందలాది మంది డ్వామా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఉపాధి’పై పంచాయతీల వారీ నిర్వహణ
నాగులుప్పలపాడులో పాల్గొన్న డ్వామా పీడీ
39,677 జాబ్ కార్డులకు ఈకేవైసీ సవరణ
కొత్తకార్డుల కోసం 9,534 దరఖాస్తులు
ఒంగోలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యా ప్తంగా శనివారం ఉపాధి హామీ పథకం గ్రామసభలు విజయవంతంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కరోజే 729 పంచాయతీలలో వీటిని నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఆ శాఖ పర్యవేక్షణ అధికారి నుంచి క్షేత్ర స్థాయిలోని ఫీల్డ్ అసిస్టెంట్ వరకు వందలాది మంది డ్వామా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల చేపట్టిన జాబ్ కార్డులకు ఈకేవైసీలో ఉన్న లోటుపాట్ల సవరణ, కొత్తవి మంజూరు ప్రధాన అంశాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభలను ఏర్పాటు చేశారు. తదనుగు ణంగా జిల్లాలోనూ నిర్వహించారు. డ్వామా పీడీ గంగ వరపు జోసఫ్‌కుమార్ మండల కేంద్రమైన నాగులుప్పల పాడులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఆయా గ్రామ సభల్లో ఇటీవల నిర్వహించిన ఈకేవైసీ ప్రక్రియలో తొలగించిన జాబ్‌కార్డులలో సవరణల కోసం 39,677 దరఖాస్తులు సిబ్బందికి అందాయి. వాటిని అక్కడే పరిశీలించి మొబైల్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేశారు. మరో 9,534 దరఖాస్తులు కొత్త జాబ్‌కార్డుల కోసం అందాయి. వాటిని పరిశీలించి మంజూరు చేయనున్నట్లు డ్వామా అధికారులు తెలిపారు.