Share News

సమన్వయంతో అధికారులు పనిచేయాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:09 PM

అధికారులు సమన్వయంతో పనిచేసి కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమన్వయంతో అధికారులు పనిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): అధికారులు సమన్వయంతో పనిచేసి కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు. ప్రజలు నుంచి వచ్చే వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని సమస్యలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. కనిగిరి ప్రాంతం క్షామపీడిత ప్రాంతంగా ఉండటంతో వర్షాలు పడినప్పుడు మాత్రమే పంటలకు అనువుగా ఉంటుందన్నారు. ఈక్రమంలో వర్షపు నీటిని వృథాగా పోకుండా చెరువులు, అలుగులు లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డబ్యూఎస్‌ డీఈ విశ్వనాధరెడ్డి, పీఆర్‌ డీఈ శ్రీధర్‌రెడ్డి, హౌసింగ్‌ డీఈ కోటిరెడ్డి, ఇరిగేషన్‌ డీఈ విజయభాస్కర్‌రెడ్డి, ఎంఈవోలు నారాయణరెడ్డి, దేవిరెడ్డి రామిరెడ్డి, తహసీల్దార్‌ జయలక్ష్మి, ఆర్‌అండ్‌బీ డీఈ సంజీవ్‌కుమార్‌, విద్యుత్‌ డీఈ ఉమాకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:09 PM