అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 27 , 2025 | 10:02 PM
మొంథా తుఫాన్ ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు న అధికారులు, సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి పి.భాస్కర్‌బాబు అన్నారు.
మండల ప్రత్యేకాధికారి భాస్కర్‌బాబు ఆదేశం
పీసీపల్లి, అక్టోబరు 27(ఆంధ్రజ్యో తి): మొంథా తుఫాన్ ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు న అధికారులు, సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి పి.భాస్కర్‌బాబు అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోతట్టు ప్రాంతా ల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సచివాలయాల్లో జనరేటర్‌ను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఎటువంటి సంఘ టన జరిగినా వెంటనే మండలకేంద్రంలో ఏర్పాటుచేసి న కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమా వేశంలో ఎంపీడీవో జీవీ కృష్ణారావు, తహసీల్దార్ ఉష, ఏవో ఎన్.రంగాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అనంత రం పెదయిర్లపాడు, లక్ష్మక్కపల్లి, వెలుతుర్లవారిపల్లి గ్రామాలను సందర్శించిన అధికారుల బృందం తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల పరిశీలన
పామూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ తుపాన్ ప్రభా వంతో మండలంలో భారీ వ ర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటు వంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మండల ప్రత్యేకాధికారి రవితేజ తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాల యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన అంకా మ్మవీధి, విరాట్‌నగర్, గోపాలపురం తదితర ప్రాంతాల ను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్. వాసుదేవరావు, ఎంపీడీవో ఎల్.బ్రహ్మయ్య, సీఐ ఎం.భీ మానాయక్, ఎస్‌ఐ టి.కిశోర్‌బాబు, పంచాయతీ కార్యద ర్శి జీవీ అరవిందారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అలాగే, సీఎస్‌పురం మండలంలో తుఫాన్ సహాయ క చర్యలు చేపట్టేందుకు 108 స్కూల్ బస్సులు, ఎక్స్‌క వేటర్లు సిద్ధంగా ఉంచినట్టు మండల ప్రత్యేక అధికారి టి.శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ షేక్ హుసేన్, ఎంపీడీవో ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
తుఫాన్ ఎదుర్కొనేందుకు అన్నిచర్యలు
దర్శి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్నిచర్యలను ప్రభుత్వం తీసుకున్నట్లు మండల ప్రత్యేకాధికారి గాయత్రీదేవి తెలిపారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు స మాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందించాలన్నారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కల్గే ప రిస్థితి నెలకొంటే త క్షణ చర్యలు తీసుకో వాలని స్పష్టం చేశా రు. ముందస్తుగా వాగులు, చెరువుల వద్ద భత్రతను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఎదురైతే పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రావణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వై.మహేశ్వరరావు, ఎంపీడీవో పి.కల్పన, డిప్యూటీ ఎంపీడీవో ఆవుల సుధాకర్, వివిధశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కురిచేడు: మొంథా తుఫాన్ ప్రభావంతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. సోమవారం మధ్యాహ్నం కురిచేడులో ర్యాలీ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రధాన కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి ప్రజలకు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సూచనలతో ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ముండ్లమూరు: ముంథా తుఫాన్ నేపథ్యంలో ఎలాం టి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మండలస్థాయి అధికారులపై ఉందని మండల ప్రత్యేకాధికారి సీహెచ్ శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం రాత్రి నుంచి తుఫాన్ ప్ర భావం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించటంతో ఆయా గ్రామాలకు కేటాయించిన అధికారులు అక్కడే ఉండా లన్నారు.
ప్రధానంగా మండలంలో చిలకలేరు, ఈదర వాగు, వేముల వాగులతో పాటు చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో ఎం.శ్రీదేవి, తహసీల్దార్ ఎల్.లక్ష్మీనారాయణ, విద్యుత్ ఏఈ అంకబాబు, తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరు: మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్ రాజా బాబు ఆదేశాలతో అన్నీశాఖల అధికారులు అప్రమ త్తమయ్యారు. మండల ప్రత్యేకాధికారి కుమార్, తహసీ ల్దార్ రమణారావు, ఎంపీడీవో అజిత, ఎస్‌ఐ మల్లి కార్జునరావు, మండల విద్యాధికారి జి.సుబ్బయ్య, తది తరులు తాళ్లూరులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెల్లంపల్లి సెంటర్లో మానవహారం ఏర్పాటుచేసి ప్రజలకు పలు సూచనలు చేశారు. దోర్నపువాగు ప్ర వాహం అధికంగా ఉండే తాళ్లూరు- విఠలాపురం మధ్య బ్రిడ్జిని అధికారులు పరిశీలించారు.