Share News

నేటి నుంచి నామినేషన్లు

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:29 AM

కొండపి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో అందుకు అవసరమైన ఎన్నికల అధికారులను నియమించారు.

నేటి నుంచి నామినేషన్లు
కొండపి పంచాయతీ కార్యాలయం

కొండపి పంచాయతీ ఎన్నిక ప్రక్రియ వేగవంతం

అధికారులకు ఇన్‌చార్జి ఆర్డీవో శిక్షణ

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కొండపి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో అందుకు అవసరమైన ఎన్నికల అధికారులను నియమించారు. స్టేజ్‌-1 అధికారిగా పంచాయతీరాజ్‌ డీఈఈ జె.రవిబాబును, స్టేజ్‌-2 అధికారిగా ఏఈఈ బి.ప్రసాదరావును, ఏఆర్వోగా శ్రీనివాసరావు నియమితులయ్యారు. నామినేషన్ల స్వీకరణపై ఎన్నికల నిర్వహణ అధికారులకు ఇన్‌చార్జి ఆర్డీవో శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. నామినేషన్ల అనంతరం ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత కార్యాలయ ఉద్యోగు లకు డీపీవో వెంకటనాయుడు దిశానిర్దేశం చేశారు.

Updated Date - Jul 30 , 2025 | 01:29 AM