Share News

రాజకీయ జోక్యం ఉండదు

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:28 AM

సెంట్రల్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు, రైతు సేవా కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చెప్పారు. బ్యాంక్‌ చైర్మన్‌గా డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య పదవీ బాఽధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం పీడీసీసీబీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

రాజకీయ జోక్యం ఉండదు
పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ప్రమాణం చేస్తున్న డాక్టర్‌ సీతారామయ్య, వేదికపై ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌ తదితరులు

పీడీసీసీబీ ద్వారా రైతులకు అండ

ఎమ్యెల్యేలు జనార్దన్‌, విజయ్‌కుమార్‌

బ్యాంక్‌ చైర్మన్‌గా డాక్టర్‌ సీతారామయ్య పదవీ బాధ్యతల స్వీకరణ

శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

సెంట్రల్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు, రైతు సేవా కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చెప్పారు. బ్యాంక్‌ చైర్మన్‌గా డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య పదవీ బాఽధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం పీడీసీసీబీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నిష్పక్షపాతంగా రైతులకు అండగా ఉండాలన్నదే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకనుగుణంగా టీడీపీపరంగాకానీ, తాము కానీ బ్యాంక్‌ కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. చైర్మన్‌ సీతారామయ్య నిర్భయం గా, నిష్పక్షపాతంతో పనిచేసి రైతులకు సేవలందించాలని ఆకాంక్షించారు. గత సాధారణ ఎన్నికల సమయంలో పార్టీ కొత్తపట్నం మండల ఇన్‌చార్జిగా డాక్టర్‌ సీతారామయ్య సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గతంలో బ్యాంక్‌ ద్వారా రైతులకు రుణపరపతి బాగా ఉండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. తిరిగి రైతులకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు కృషిచేసేలా చర్యలు తీసుకోవాలని సీతారామయ్యకు సూచించారు. సమావేశంలో ఏపీ లైవ్‌ స్టాక్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రియాజ్‌, ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత తదితరులు మాట్లాడారు. చివరిలో డాక్టర్‌ సీతారామయ్య మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకం వమ్ముకాకుండా పనిచేసే మంచి ఫలితాలు రాబడతానని హామీ ఇచ్చారు. తొలుత సీతారామయ్య బంధుమిత్రుల సమక్షంలో అధికారికంగా బాఽధ్యతలు చేపట్టారు. ఆయనకు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులు, పలువురు వైద్యులు, ఇతర ప్రముఖులు పాల్గొని ీఅభినందించారు. సీతారామయ్య శుభాకాంక్షలు తెలిపిన వారిలో డాక్టర్‌ నామినేని కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ విజయకుమార్‌, గోరంట్ల పెద్దవీరయ్య (కేబీ), టీడీపీ నాయకులు నల్లమోతు బాలగంగాధర్‌, మక్కెన శ్రీనివాసరావు, గుండపనేని శ్రీనివాసులు, మండవ మురళీకృష్ణ, చిడిపోతు వెంకటేశ్వర్లు, డాకా శ్రీనివాసరెడ్డి, నాగబోయిన చలపతిరావు, నలమలపు అంకిరెడ్డి, మారెళ్ల శ్రీనివాసరావు, గుమ్మడి సాయిబాబు, కాకర్ల లక్ష్మీవరప్రసాద్‌, మండల ఆంజనేయులు, కొండ్రగుంట రంగారావు, కొమ్మాలపాటి సురేష్‌, మారెళ్ల రాంజేద్రప్రసాద్‌, కొప్పోలు బాలాజీరావు(రిటైర్డ్‌ మేనేజర్‌, పీడీసీసీబీ) కొప్పోలు వీరయ్య (మాజీ సర్పంచ్‌, హెచ్‌ నిడమానూరు), మారెడ్డి సుబ్బారెడ్డి, కామేపల్లి శ్రీనివాసరావు, షేక్‌ ఖాజావలి, సూదనగుంట అజయ్‌కుమార్‌, రావుల పద్మజ, చల్లగుండ్ల అనంతరంగనాథ్‌, నందిగం కోటేశ్వరరావు, కొమ్మినేని రమేష్‌బాబు(సర్పంచ్‌) ఉన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 01:28 AM