ఎరువుల అక్రమ విక్రయాలపై చర్యలేవీ!
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:34 PM
ఎరువులు, విత్త నాలు అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవటంలో జాప్యం జరుగుతుంది. విజిలెన్స్ అధికారులతో పాటు వ్యవసాయాధికారులు, పోలీసు అధికారులు కొద్దిరోజుల క్రితం ముమ్మరంగా ఎరువులు, విత్తనాల దుఖాణాలపై దాడులుచేసి పలుచోట్ల కేసులు నమోదు చేసిన విష యం తెలిసిందే.
అక్రమార్కులకు అధికారులు
సహకరిస్తున్నారనే విమర్శలు
రికార్డులు క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం
దర్శి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎరువులు, విత్త నాలు అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవటంలో జాప్యం జరుగుతుంది. విజిలెన్స్ అధికారులతో పాటు వ్యవసాయాధికారులు, పోలీసు అధికారులు కొద్దిరోజుల క్రితం ముమ్మరంగా ఎరువులు, విత్తనాల దుఖాణాలపై దాడులుచేసి పలుచోట్ల కేసులు నమోదు చేసిన విష యం తెలిసిందే. అనేకచోట్ల అక్రమ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ఆతర్వాత విచారణ ఏకారణం చేతనో మం దగిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నమోదైన 6ఏ కేసులు జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఆతర్వాత పలుచోట్ల వ్యవసాయాధికారు లు తనిఖీలు చేసిన ప్రాంతాల్లో పట్టుబడిన అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవటంలేదనే విమర్శలు వినిసి స్తున్నాయి.
దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో అనేక షాపుల్లో వందలాది బస్తాల యూరియా అక్రమంగా ని ల్వ ఉంచగా పట్టుకున్న విషయం తెలిసిందే. పలుచో ట్ల లైసెన్సులు కూడా లేకుండా పలువురు వ్యాపారులు విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడిన విషయం విధితమే. అక్రమంగా ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచిన అక్ర మార్కులపై చర్యలు తీసుకోవటంలో జాప్యం చేస్తున్నా రనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు రికార్డులు క్రమబద్ధీకరించుకునేందుకు స్థానిక అధికారు లు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వ్యవసా యశాఖ అధికారులు దాడులు చేసినప్పుడు పలు షా పుల యజమానులు నిల్వలు లేనట్లు లెక్కలు చూపిం చారు. అప్పటికే వారి వద్ద వందలాది బస్తాల యూరి యా, విత్తనాలు నిల్వలు ఉన్నట్టు పలుచోట్ల గ్రామస్థు లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్థానిక అధికారులు పరి గణలోకి తీసుకోలేదు. అక్రమార్కులు ఇతర ప్రాంతాల కు తరలించి అక్రమంగా నిల్వచేసిన ఎరువులు, విత్త నాలను అమ్ముకునేందుకు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తర్వాత అనుకూలమైన రైతులతో వే లిముద్రలు వేయించుకొని, బిల్లులు రాసి లెక్కలు సరి చేసుకునే అవకాశాలు కల్పించారనే విమర్శలు వినిపి స్తున్నాయి. స్థానిక అధికారుల తీరుపట్ల రైతులు, ప్రజ లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల, విత్తనాల వ్యాపారులతో స్థానిక అధికారులకు ఉన్న సంబంధాల తో అక్రమార్కులు తప్పించకునే అవకాశం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఉన్నతాధికారులు వాస్తవాలు గుర్తించి లోతుగా దర్యాప్తు చేసినట్లయితే అన్నివిషయా లు వెల్లడయ్యే అవకాశం ఉంది.