Share News

రేపటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:30 AM

ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే వారికి శిక్షణ తరగతులు ముగిశాయి. జిల్లాలోని పాఠశాలల్లో ఉన్న ఖాళీల్లో వారిని నియమించారు. ఉమ్మడి జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ, మునిసిపల్‌, గిరిజన పాఠశాలల్లో 673 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా 657 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.

రేపటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు

ప్రభుత్వ పాఠశాలల్లో తీరనున్న కొరత

ఉమ్మడి జిల్లాలో 657 మంది నియామకం

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే వారికి శిక్షణ తరగతులు ముగిశాయి. జిల్లాలోని పాఠశాలల్లో ఉన్న ఖాళీల్లో వారిని నియమించారు. ఉమ్మడి జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ, మునిసిపల్‌, గిరిజన పాఠశాలల్లో 673 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా 657 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. నాలుగు పోస్టులకు అభ్యర్థులు ఎంపికైనప్పటికీ వివిధ కారణాలతో నిరాకరించారు. మరో 11 ఉపాధ్యాయ పోస్టులకు అర్హత ఉన్న వారు లేక భర్తీ చేయలేదు. ప్రస్తుతం 657 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను కేటగిరీ-3 పాఠశాలల్లో నియమించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ప్రక్రియను విద్యాశాఖ అధికారులు పూర్తిచేసినట్లు తెలిసింది. డీఎస్సీలో ఎంపికైన విద్యార్థులకు ఈనెల 3 నుంచి 9వతేదీ వరకు శిక్షణ ఇచ్చారు. వారికి వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి పాఠశాలలకు కేటాయించారు. వెంటనే పాఠశాలల్లో చేరేందుకు కొత్త వారు సిద్ధమయ్యారు. దీంతో ఆయా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లతోపాటు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. ఇప్పటికే కేటగిరీ-3లో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వాటిల్లో మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త వారిని నియమించారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Updated Date - Oct 12 , 2025 | 01:30 AM