Share News

స్కూళ్లకు ‘కొత్త’కళ

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:20 AM

ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

స్కూళ్లకు ‘కొత్త’కళ
గోళ్లవిడిపిలో ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు

అనేక పాఠశాలల్లో తీరిన కొరత

పూర్వవైభవం దిశగా బడులు

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా విజయవాడలో నియామకపత్రాలు ఇచ్చారు. అనంతరం వారికి శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి పాఠశాలలకు కేటాయించారు. అలా జిల్లావ్యాప్తంగా 657 మందికి నియామకపత్రాలను అందజేశారు. వారిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎలిమెంటరీ పాఠశాలల్లో 619 మంది, గిరిజన పాఠశాలల్లో 38మంది ఉన్నారు. ఈ కొత్త ఉపాధ్యాయులందరినీ కేటగిరీ-3లో నియమించారు. దీంతో జిల్లావ్యాప్తంగా అనేక పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. తొలిరోజు కొందరు వారి కుటుంబ సభ్యులతో సహా వెళ్లి పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పాఠశాలలకు పూర్వవైభవం రానుంది. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలు జరగడంతో అనేక పాఠశాలల్లో కొరత ఏర్పడింది. ప్రజాప్రభుత్వం కొత్త ఉపాధ్యాయుల నియామకంతో ఆ పాఠశాలలు కొత్త వారితో కళకళలాడుతున్నాయి.

Updated Date - Oct 14 , 2025 | 01:20 AM