డీలర్లకు కొత్త ఈ పోస్ మిషన్లు
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:15 AM
కార్డుదారులకు పటిష్టంగా రేషన్ పంపిణీకి ప్రజా ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఈపోస్ మిషన్లు డీలర్లకు అందజేసే కార్యక్రమం మొదలైంది. ఒంగోలు నగరంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ మిష న్లను శుక్రవారం పంపిణీ చేశారు.
ఒంగోలు నగరంలో పంపిణీ
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : కార్డుదారులకు పటిష్టంగా రేషన్ పంపిణీకి ప్రజా ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఈపోస్ మిషన్లు డీలర్లకు అందజేసే కార్యక్రమం మొదలైంది. ఒంగోలు నగరంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ మిష న్లను శుక్రవారం పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీలో అనేక మార్పులు చేపట్టింది. అందులో భాగంగా కొత్త ఈపోస్ మిషన్లను మంజూరు చేసింది. వాటిని ఏవిధంగా వినియోగించాలన్న దానిపై డీలర్లకు అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ ఎఫ్‌ఐ రామకృష్ణ, విజన్ టెక్ అధికారి సాయి, డీలర్స్ అసోసియేషన్ ఒంగోలు నగర అధ్యక్షుడు బెజవాడ మురళీకృష్ణ, కార్యదర్శి నండూరి చంద్ర, కోశాధికారి సోమిశెట్టి శ్రీనివాసరావు, సీనియర్ సలహాదారులు మారుతీరావు తదితరులు పాల్గొన్నారు.