గత పాలకుల నిర్లక్ష్యం.. ప్రజాధనం వృథా
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:06 PM
గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన అస్తవ్యస్త విధానాలతో అనేక పథకాలు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. వైసీపీ పాలకుల అసమర్థతతో విద్యార్థుల చదువులకు ఆటంకాలు కలుగుతున్నాయి.
అర్ధంతరంగా నిలిచిపోయిన భవనాలు
చాలీచాలని గదులు
విద్యార్థుల చదువుకు ఆటంకాలు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలన్నీ
దర్శి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన అస్తవ్యస్త విధానాలతో అనేక పథకాలు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. వైసీపీ పాలకుల అసమర్థతతో విద్యార్థుల చదువులకు ఆటంకాలు కలుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాలంలో ప్రవేశపెట్టిన నాడు-నేడు పథకం ఆరంభశూరత్వంగా మిగిలిపోయింది. ఒక్క పాఠశాల భవన నిర్మాణం కూడా పూర్తి కాలేదు.
దర్శి మండలంలో 164 పనులను రూ.18.72 కోట్లతో చేపట్టారు. అందులో 124 పనులు ప్రారంభించి రూ. 12.40 కోట్లు ఖర్చు చేశారు. నిర్మాణం చేపట్టిన భవనా ల్లో ఒక్కటీ పూర్తికాలేదు. పాఠశాలల వద్ద అసం పూర్తిగా మిగిలిన భవనా లు వెక్కిరిస్తున్నాయి. కూ టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వి ద్యాశాఖా మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి అనే క సంస్కరణలు చేపట్టారు. దీంతో విద్యార్థుల సం ఖ్య పాఠశాలల్లో పెరిగింది, ఈనేపథ్యంలో నిర్మాణం చే పట్టిన భవనాలు పూర్తికాక ప్రస్తుతం ఉన్న తరగతి గదులు చాలక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్ర భుత్వ అధికారంలోకి వ చ్చిన తరువాత ఆ పథకం పేరుమార్చి మ న బడి-మన భవిష్యత్తుగా నామకరణం చే సింది. సర్వశిక్ష అభియా న్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ గత ప్రభుత్వ నిర్యక్ష్యం వల్ల అభాసుపాలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా నిలిచిపోయిన భవనాల నిర్మాణాలను పూర్తి చేసే విషయంపై దృష్టిసారించ లేదు. ఇటీవల నూతన డీఎస్సీతో ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటికే విద్యార్ధుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగాయి. ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిలిచిపోయిన భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు.