కేజీబీవోల నిర్వహణ లో నిర్లక్ష్యం వీడాలి
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:26 PM
కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వీడాలని జీసీడీవో హేమలత అన్నారు. పెద్దారవీడులోని కేజీబీవీని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ముఖ్యంగా ఆరోగ్య, పారిశుధ్య సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ గురించి ఆరాతీశారు.
పెద్దారవీడు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వీడాలని జీసీడీవో హేమలత అన్నారు. పెద్దారవీడులోని కేజీబీవీని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ముఖ్యంగా ఆరోగ్య, పారిశుధ్య సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ గురించి ఆరాతీశారు. పాఠశాల రికార్డులను, వస్తు సామగ్రి నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీసీడీవో హేమలత మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు శ్రీనివాసులు, శింగంపల్లి సుబ్రమణ్యం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
మెను ప్రకారం భోజనం ఇవ్వాలి
తర్లుపాడు : మండలంలోని కలుజువ్వలపాడు కస్తూర్బా పాఠశాలను జీసీడీవో హేమలత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెడుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల టాయిలెట్లు, పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈమేరకు సిబ్బంది పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈమె వెంట ప్రిన్సిపల్ మారుతీదేవి, ఉపాధ్యాయులు ఉన్నారు.