సీఎం హెలిప్యాడ్ ఏర్పాటులో నిర్లక్ష్యం
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:20 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇరువురు అర్‌అండ్‌బీ అధికారులకు షోకాజ్ నోటీసులను ఆశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వి.రామచంద్ర జారీ చేశారు.
ఇరువురు ఆర్‌అండ్‌బీ అధికారులకు ఈఎన్‌సీ షోకాజ్ నోటీసులు
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇరువురు అర్‌అండ్‌బీ అధికారులకు షోకాజ్ నోటీసులను ఆశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వి.రామచంద్ర జారీ చేశారు. మంగళవారం కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పీసీపల్లి మండలం జి.లిం గన్నపాలెం గ్రామంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ప్రారంభోత్సవంలో ముఖ్య మంత్రి పాల్గొన్నారు. అయితే లింగన్న పాలెంలో హెలిప్యాడ్ ఏర్పాటు బాధ్య తలను ఆర్‌అండ్‌బీ ఇన్‌చార్జి ఎస్‌ఈ ఎస్.రవినాయక్, కనిగిరి ఇన్‌చార్జి ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ సంపూర్ణరావులకు అప్పగించారు. వారు సీఎంవో కార్యాలయ ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఈఎన్‌సీ.. సక్రమంగా విధులు నిర్వహించకుండా, హెలిప్యాడ్‌ను సరిగ్గా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో నోటీసులు జారీచేశారు. నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.