Share News

సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:48 PM

సహజ వనరు లను సద్వినియోగం చేసుకోవటంతో పాటు ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. విద్యుత్‌ వాడకంపై అవగాహన పెంపొం దించే కార్యక్రమంలో భాగంగా విద్యుత్‌ శాఖ ఆధ్వర్యం లో మంగళవారం దర్శిలో ర్యాలీ నిర్వహించారు.

సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): సహజ వనరు లను సద్వినియోగం చేసుకోవటంతో పాటు ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. విద్యుత్‌ వాడకంపై అవగాహన పెంపొం దించే కార్యక్రమంలో భాగంగా విద్యుత్‌ శాఖ ఆధ్వర్యం లో మంగళవారం దర్శిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరాన్ని మించి విద్యుత్‌ వాడితే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. సోలార్‌ విద్యుత్‌ వైపు అందరూ దృష్టి సారించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్‌ విద్యుత్‌ వినియోగాన్ని పెంపొందించేందుకు ఎంతో కృషి చేస్తు న్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశె ట్టి పాపారావు, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, విద్యుత్‌ శాఖ ఈఈ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ ఎం.శ్రావణ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, కమిషనర్‌ వై.మహేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి, సుబ్బారావు, జి.స్టీవెన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రభుత్వ ల క్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాబ్‌ మేళాను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏడాది క్రితం జాబ్‌మేళా నిర్వహించి 500 మందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు చెప్పారు. ప్రస్తుతం మూడోసారి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌చైర్మన్‌ జి.స్టీవెన్‌, డిస్ర్టిబ్యూటరీ కమిటీ అధ్యక్షు డు కె.వెలుగొండారెడ్డి, టీడీపీ నాయకులు సంగా తిరుపతి రావు, పుల్లలచెరువు చిన్నా, మారెళ్ళ వెంకటేశ్వర్లు, గొర్రె సుబ్బారెడ్డి, ఫణిదపు వెంకట రామయ్య, కౌన్సిలర్‌ కనకం శ్రీనివాసరావు, తదితరులు పా ల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 11:48 PM