రేపు జాతీయ లోక్‌అదాలత్
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:11 AM
ఇరువర్గాల ఆమోదంతో కేసుల పరిష్కారానికి కక్షిదారులంతా సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.భారతి కోరారు. శనివారం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహణ
జిల్లా ప్రధాన న్యాయాధికారి భారతి వెల్లడి
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇరువర్గాల ఆమోదంతో కేసుల పరిష్కారానికి కక్షిదారులంతా సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.భారతి కోరారు. శనివారం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కేసుల పరిష్కారం కోసం జిల్లాలోని కోర్టుల్లో 25 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటి ద్వారా సుమారు 9వేల కేసులను గుర్తించామని ఆమె పేర్కొన్నారు. రాజీపడదగిన అన్ని క్రిమినల్, చెక్ బౌన్స్, వివాహ సంబంధమైనవి, అన్ని రకాల సివిల్ కేసులు ఇరువురి ఆమోదంతో పరిష్కరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని పెండింగ్ కేసుల్లో ఉన్నవారు ఉపయోగించుకొని వ్యాజ్యాలను పరిష్కరించుకోవాలని కోరారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసులలో తీర్పు అంతిమమని స్పష్టం చేశారు. కోర్టులలో చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని తెలిపారు. పోలీస్, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కేసుల పరిష్కారానికి సహకరించాలని భారతి కోరారు.