Share News

డిసెంబరు 13న జాతీయ లోక్‌అదాలత్‌

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:07 PM

డిసెంబరు 13న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎ.ఓంకార్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.భరత్‌చంద్ర అన్నారు.

డిసెంబరు 13న జాతీయ లోక్‌అదాలత్‌
అధికారులతో మాట్లాడుతున్న న్యాయాధికారులు

గిద్దలూరు టౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 13న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎ.ఓంకార్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.భరత్‌చంద్ర అన్నారు. శనివారం పోలీసు, బ్యాంక్‌, టెలిఫోన్‌ అధికారులకు న్యాయవాదులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయాధికారి ఓంకార్‌ మాట్లాడుతూ సమయం, ధనం ఆదా చేసుకుని రాజీ మార్గమే రాజమార్గమని తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పా లుగుళ్ల శేషశైనారెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ బి.ప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి ఎ.తిరుమలప్రసాద్‌, గిద్దలూరు అర్భన్‌, రూరల్‌ సీఐలు కె.సురేష్‌, జె.రామకోటయ్య, అర్థవీడు, బేస్తవారపేట, కంభం ఎస్సైలు ఎం.శివనాంచారయ్య, రవీంద్రరెడ్డి, బి.నరసింహారావు, ఎక్సైజ్‌ ఎస్సైలు జాన్సన్‌, కె.ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:07 PM