Share News

ఒంగోలులో ఘనంగా జాతీయ కరాటే పోటీలు

ABN , Publish Date - Aug 17 , 2025 | 10:50 PM

సిద్ధార్థ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 43వ జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం ఒంగోలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోటీలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రారంభించారు.

ఒంగోలులో ఘనంగా జాతీయ కరాటే పోటీలు
విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌, ముత్తుముల

హాజరైన ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌, ముత్తుముల

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : సిద్ధార్థ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 43వ జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం ఒంగోలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోటీలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాహకులు, జాతీయ కోచ్‌ నల్లూరి మోహన్‌రావు నేతృత్వంలో జాతీయ స్థాయి పోటీలు ఒంగోలులో నిర్వహించడం అభినందనీయమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రతి క్రీడాకారుడు గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించాలని చెప్పారు. కరాటేతో ఆత్మస్తైర్యం, కృషి, పట్టుదల లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా విజేతలకు ఎమ్మెల్యేలు బీఎన్‌, ముత్తుముల బహుమతి ప్రదానం చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ 30ఏళ్లుగా కరాటే అకాడమీ నిర్వహిస్తూ మోహన్‌రావు ఎందరో క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దారన్నారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆత్మ రక్షణకు కరాటే మరింత ఉపయోగపడుతుందని చెప్పారు. అకాడమీ ప్రెసిడెంట్‌ మండవ మురళీకృష్ణ, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్‌ నూకసాని బాలాజి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, ఆలిండియా కోచ్‌ కొండూరు, శ్రీప్రతిభ సంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు, డాక్టర గుండవరపు రాఘవ, శ్రీహర్షిణి విద్యా సంస్థల ఛైర్మన్‌ గోరంట్ల రవికుమార్‌, మండవ సుబ్బారావు పాల్గొన్నారు. ఒకరోజు జరిగిన ఈ పోటీలలో 12 రాష్ట్రాల నుంచి 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 10:50 PM