భక్తిశ్రద్ధలతో నాగులచవితి
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:37 AM
మండల పరిధిలోని మహిళా భక్తులు నాగుల చవితి పర్వది నాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో శనివారం ఘనంగా నిర్వహించారు.
చినగంజాం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని మహిళా భక్తులు నాగుల చవితి పర్వది నాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో శనివారం ఘనంగా నిర్వహించారు. నాగేంద్రస్వామి ఆలయాలల్లో, పుట్టల వద్ద మహిళా భక్తులు బారులు తీరారు. భక్తులు పసుపు, కుంకుమతో నాగశిలలను ఆలకరించి ప్రదక్షిణలు చేశారు. స్వామి వారి పుట్టల వద్ద సలిమిడి, పానకం, సజ్జలు, వడపప్పు, నాగేంద్రస్వామికి ప్రీతి పాత్రమైన ఆవుపాలను పోశారు, దారాలను చుట్టి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకున్నారు. కొత్తపాలెం గ్రామంలోని బాలకోటేశ్వరస్వామి ఆలయం వద్ద, కడవకుదురు బస్టాండ్, నాగులచెరువుల సమీపంలో, చినగంజాం, పలు గ్రామాల్లోని పుట్టల వద్ద, ఆలయాలలో వల్లీదేవసేవ సుబ్రమణ్యేశ్వర స్వామికి అష్టోత్తర శతనామ కుంకుమార్చనలు, అభిషేకాలను నిర్వహిం చారు. నాగరాజ పాహిమాన్, ‘నాగదేవత రక్షమాన్’ అంటూ భక్తులు చేసిన స్వామి నామస్మరణలతో పుట్టల వద్ద మారుమ్రోగింది. పుట్టల వద్ద భక్తులకు అసౌకర్యం క లుగకుండా కమిటి సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు. సంతరావూరు. చింతగుం పల్లి, గొనసపూడి, నీలాయపాలెం, రాజుబంగారుపాలెం తదితర గ్రామాల్లోని స్వామి వారి పుట్టల వద్ద మహి ళా భక్తులు పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు.
ఇంకొల్లు : మండలంలో శని వారం నాగులచవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని కడవకుదురు రోడ్డులోని భీమవరం పుట్ట వద్ద భక్తులు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో మహిళలు తరలి వచ్చి పుట్టవద్ద నాగేంద్ర స్వామికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
అద్దంకి : నాగులచవతిని మహిళా భక్తులు శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని రామ్‌నగర్ పుట్టవద్ద, పోలేరమ్మ దేవాలయంలోని పుట్ట వద్ద, శింగరకొండలోని సు బ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోని పుట్ట, కాకతీయ కమ్మ అన్నదాన సత్రం వద్ద ఉన్న పుట్టల వద్ద భక్తు లు పెద్ద సంఖ్యలో పూజలు చేసి పాలు పోశారు. శనివారం కావడంతో భక్తులు శింగర కొండలోని ప్రసన్నాంజ నేయస్వామి, లక్ష్మీ నరశింహస్వామి వార్లను దర్శించుకొని రామాలయం ఆవరణలోని సుబ్రహ్మ ణేశ్వరస్వామి దేవాలయంలో పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. అన్ని గ్రామాలలో మహిళలు పుట్టల వద్ద పూజలు నిర్వహించి పాలు పోశారు.