Share News

కార్యకర్తల సంక్షేమమే నా ఎజెండా!

ABN , Publish Date - May 19 , 2025 | 10:40 PM

కార్యకర్తల సంక్షే మమే తన ఎజెండా అని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. సోమవారం కనిగిరిలోని ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో జరిగిన మినీమహానాడు లో తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి డాక్టర్‌ ఉగ్ర పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నేతలతో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

కార్యకర్తల సంక్షేమమే నా ఎజెండా!
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర, నూకసాని బాలాజి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

మినీమహానాడుకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు

కనిగిరి, మే 19 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సంక్షే మమే తన ఎజెండా అని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. సోమవారం కనిగిరిలోని ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో జరిగిన మినీమహానాడు లో తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి డాక్టర్‌ ఉగ్ర పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నేతలతో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతం ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, అభిమానులే పార్టీకి ముఖ్యమ న్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేసేందుకు తాను కష్టపడుతున్నానన్నారు. అదే సమ యంలో కార్యకర్తలకు, శ్రేణులకు దగ్గరగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొ క్కటిగా నెరవేర్చే క్రమంలో కొంత కార్యకర్తలకు, నా యకులకు తాను దూరంగా ఉన్నా, వారి మనసులకు దగ్గరగానే ఉన్నానని మినీమహానాడుకు వచ్చిన జన వాహిని మరోసారి రుజువు చేసిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి పదవుల కల్పించడంలో స్వార్థానికి తావులేకుండా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పా రు. రాష్ట్రంలో సంక్షేమ పాలన చంద్రబాబుతోనే సాధ్య మని నేటి పాలన రుజువు చేస్తుందన్నారు. కనిగిరి లాంటి మారుమూల ప్రాంతంలో పారిశ్రామిక బాటలు వేసేందుకు తన సంకల్పానికి చేయూత ఇస్తూ ముం దుకు నడిపిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు రుణపడి ఉంటామన్నారు. రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాం ట్‌ ఏర్పాటుతో కనిగిరిలోని ప్రజలకు ఉపాది లభిస్తుం దన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో రైల్వే లైన్‌, ట్రిపుల్‌ఐటీ, బైపాస్‌, మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేసి నట్లు చెప్పారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప ర్యాటకశాఖ అభివృద్ధి చైర్మన్‌ నూక సాని బాలాజి మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందంటే చంద్రబాబు సారథ్యం, కార్యకర్తల కృషి అని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోళ్ళు పెగిలి న నేతలు ఇప్పుడు పత్తా లేకుండా పోయారన్నారు. అధికారాన్ని చూసి విర్రవీగితే కాలమే సమాధానమే చెప్తుందని చేప్పేరోజులు ఇంకా ఉన్నాయన్నారు. ఎన్నిక ల్లో ఇచ్చిన వాగ్ధానాలను చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. కనిగిరి నియోజకవర్గంలో అభి వృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయిస్తూ ఎమ్మె ల్యే డాక్టర్‌ ఉగ్ర ముందంజలో ఉన్నారని అన్నారు. అ నంతరం మినీమహానాడుకు సంబంధించి తీర్మానాలు చేశారు. తొలుత వివిధ కారణాలచే మృతి చెందిన టీడీ పీ శ్రేణులకు సంతాపం వెలిబుచ్చి కొద్దిసేపు మౌనం పాటించారు.

కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ యారవ రమాదేవి, టీడీపీ మండల కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, ఆరు మండలాల అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, పువ్వాడి రామయ్య, పువ్వాడి వెంకటేశ్వర్లు, బొమ్మనబోయిన వెంగయ్య, సా నికొమ్మ తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్‌), ముత్తిరెడ్డి వెంక టరెడ్డి, మైనారిటీ నాయకులు రోషన్‌ సంధాని, జంషీర్‌ అహ్మద్‌, అహ్మద్‌, పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివా సులురెడ్డి, నారపరెడ్డి (యడవల్లి) శ్రీనివాసులురెడ్డి, ఫిరోజ్‌, ముచ్చుమూరి చెంచిరెడ్డి, గోనా ప్రతాప్‌, అడు సుమల్లి ప్రభాకర్‌, బ్రహ్మం గౌడ్‌, కరణం అరుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సన్మానం: మినీమహానాడులో నామినేటెడ్‌ పదవులు పొందినవారిని ఘనంగా సన్మానించారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ యారవ రమాదేవి, షీప్‌యార్డు సొసైటీ చైర్మన్‌ తోడేటి గోపిలను ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సత్కరించారు.

Updated Date - May 19 , 2025 | 10:40 PM