Share News

జిల్లా సాధనలో ముత్తుముల కృషి అభినందనీయం

ABN , Publish Date - Dec 02 , 2025 | 10:41 PM

మార్కాపురం జిల్లా రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని గిద్దలూరు ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ కార్యవర్గం స్థానిక టీడీపీ కార్యాలయంలో కలిసి పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు.

జిల్లా సాధనలో ముత్తుముల కృషి అభినందనీయం
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని సన్మానిస్తున్న ఎన్జీవో అసోసియేషన్‌ సభ్యులు

ఎమ్మెల్యేను అభినందించిన ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లా రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని గిద్దలూరు ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ కార్యవర్గం స్థానిక టీడీపీ కార్యాలయంలో కలిసి పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. దశాబ్ధ కాలంనాటి ఆశ ఫలించినందుకు వారు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. ఇటీవల గిద్దలూరు ఎన్జీవో అసోసియేషన్‌ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల వారందరినీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అభినందించారు.

‘రైతన్న మీకోసం’లో అశోక్‌ రెడ్డి

కంభం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : సాగు భూమి కలిగి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు, పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు మొత్తం సంవత్సరానికి రూ.20వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి చెప్పారు. మంగళవారం రాత్రి కంభం పంచాయతీ కార్యాలయ ఆవరణలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులను కలుసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మంజూరు చేసిన అన్నదాత సుఖీభవ పథకం, వ్యవసాయంలో పంచసూత్రాలు, వాటి ఆవశ్యకతను వివరించారు. అనంతరం పాడి రైతులకు పశువుల దాణ పంపిణీ చేశారు. ఎంపీడీవో వీరభద్రాచారి, పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 10:41 PM