ముసురు.. బేజారు
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:41 PM
మండలంలో కురుస్తున్న ముసురువానకు సాగు చేసిన పంటలు నష్టానికి దారి తీస్తున్నాయి.రైతులు అయోమయానికి గురవుతున్నారు. అతివృష్టి అనావృష్టి కారణాలతలో పైర్లు చేతికందక రైతులు ఆందోళనలో పడ్డారు. ఈ ఏడాది ఆరంభం వరకు అనావృష్టి ఉండగా, అదును దాటి పోకుండా అష్టకష్టాలు పడి ఖరీ్‌ఫలో పత్తి, మిరప వేశారు.
మిరపలో పెరుగుతున్న కలుపు
కుళ్లుతున్న పత్తి
పెద్ద దోర్నాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలో కురుస్తున్న ముసురువానకు సాగు చేసిన పంటలు నష్టానికి దారి తీస్తున్నాయి.రైతులు అయోమయానికి గురవుతున్నారు. అతివృష్టి అనావృష్టి కారణాలతలో పైర్లు చేతికందక రైతులు ఆందోళనలో పడ్డారు. ఈ ఏడాది ఆరంభం వరకు అనావృష్టి ఉండగా, అదును దాటి పోకుండా అష్టకష్టాలు పడి ఖరీ్‌ఫలో పత్తి, మిరప వేశారు. బోర్ల నుంచి వచ్చీరాని నీటితో పంటలు కాపాడుకున్నారు. ఆగస్టు-సెప్టెంబరులో కురిసిన వర్షాలకు సంతోషించారు. వేసవిలో సాగు చేసిన పత్తి తీతలు దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే వర్షాలు సమయానికి కురుస్తున్నాయని భావించిన పలువురు పత్తిని తొలగించి మిరప నాటారు. ఇటీవల రోజూ వానలు కురుస్తుండడంతో కలుపు పెరిగిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప మొక్కలు ఆకులన్నీ రాలిపోయి ఎర్రగా మారుతున్నాయి. ఎకరాకు 12,000 వేల మొక్కలు నాటాల్సి ఉండగా విడతల వారీగా 2,000 మొక్కలు నాట్లు వేశారు. అయినా మిరప మొక్కలు కుదురుకోలేదు. వాన వీడక పోవడంతో పైరు చేతికొస్తుందా రాదా అని ఆందోళన చెందుతున్నారు. గాలులు లేకపోవడంతో అరటి, బొప్పాయికి నష్టం లేదని చెప్తున్నారు.
చెట్లపైనే కుళ్లుతున్న పత్తి కాయలు
జూలై, ఆగస్టులో ఖరీఫ్ సాగు చేసిన పత్తి రైతులదిమరో వేదన. ముందుగా సాగు చేసిన పత్తి రైతులు తీతలు పూర్తి చేసి తొలగించి కొందరు మిరప నాట్లు వేసుకోగా మరి కొందరు మొక్కజొన్న, మినుము, ఉలవ తదితర అపరాలను విత్తారు. పత్తి తీత ఆలస్యమైన చోట ముసురు దెబ్బతీస్తున్నాయి. కాయలు చెట్లపైనే కుళ్లి పోతున్నాయి. ధరలు పడిపోయాయి. కూలీలకు కూడాసరిపోని ధరలు అడుగుతున్నారు. క్వింటాకు రూ.3,500 నుంచి రూ.4,200 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో బాగా నష్ట పోతున్నామని పత్తి రైతులు వాపోతున్నారు. సీసీఐ కొనుగోళ్లు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు.
షేడ్‌నెట్ల నారుతో రైతులకు నష్టం
ఈ ఏడాది తొలి నాళ్లలో షేడ్ నెట్లలో నార్లు పోసేందుకు యజమానులు జంకారు. రైతులు ఇచ్చిన ఆర్డర్ల మేరకే నార్లు పోషణ చేశారు. ఆగస్టు నుంచి కురుస్తున్న వానలను చూసి సెప్టెంబరులో విపరీతంగా నార్లు పోశారు. మొక్క రూ.1కి తగ్గకుండా అమ్మకాలు చేశారు. ట్రేలో 100 మొక్కలు ఉండాల్సి ఉండగా 70 శాతం కూడా లేకున్నా వంద మొక్కల చొప్పున అమ్మకాలు జరిపారు. అధికారులు పట్టించుకోక పోవడంతో వారి ఇష్టం వచ్చినట్లు అమ్ముతున్నారు. నాట్లు వేసిన భూముల్లో మధ్యలో వేరు పురుగుతో కొన్ని, నీటి తేమ శాతంతో కొన్ని అరక సేద్యంతో కొన్ని మొక్కలు చనిపోతున్నా తప్పని పరిస్థితిల్లో రైతులు కొనుగోలు చేస్తున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని షేడ్ నెట్ల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు.
తర్లుపాడు : వర్షాలకు మిరప పైరు దెబ్బతిన్నది. సీతానాగులవరం, తర్లుపాడు, నాయుడుపల్లెలో సాగు చేసిన మిరప ప్రస్తుతం కు రుస్తున్న వర్షాలకు నీరు నిలబడి ఉరకెత్తుతాయోమనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో తర్లుపాడు, సీతానాగులవరం, నాయుడుపల్లె, మీర్జపేట, పోతలపాడు, గానుగపెంట, కలుజువ్వలపాడులో సుమారు 800 ఎకరాల్లో మిర్చిని సాగు చేశారు. బర్లీ పొగాకు కూడా ఉరకెత్తే అవకాశం ఉందని రైతు లు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు ఎక్కువైతే మిర్చి, బర్లీ పొగాకు నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు.
కొనకనమిట్ల : వర్షాలతో పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారి ప్రకా్‌షరావు అన్నారు. మండలంలోని పెదారికట్ల గ్రామంలో బుధవారం దర్శి వ్యవసాయసహాయకులు బాలాజీనాయక్, ఏవోలు పత్తిపంటను పరిశీలించారు. పంటను కాపాడుకునేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి విక్రమ్, బీఏఏ గంగయ్య పాల్గొన్నారు.
వర్షాలు కొనసాగితే పత్తికి నష్టం : ఏడీఏ బాలాజీ నాయక్
పెద్దారవీడు : మండలంలోని సాగుచేసిన పత్తికి ఇప్పటి వరకూ కు రిసిన వర్షాలతో ఎటువంటి ఇబ్బంది లేదని, ఇంకా వర్షాలు కురిస్తే నష్టం తప్పదని ఏడీఏ బాలాజీనాయక్ అన్నారు. మండలంలోని పుచ్చకాయలపల్లిలో వర్షపునీరు నిలిచిన పత్తి పొలాలను బుధవారం వ్యవసాయాధికారితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌడు భూములలో పత్తి మొక్కల ఆకులు ఇప్పటికే నల్లబడే పరిస్థితి ఉందన్నారు. వానలు కొనసాగితే పశ్చిమ ప్రకాశంలో సాగుచేసిన పత్తితోపాటు వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వా టిల్లే పరిస్థితి నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో సాంకేతిక సిబ్బంది సునీల్‌కుమార్, వీఏఏ ఆదిలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.
పొలాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి
కంభం : తుఫాన్‌తో కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు ని ల్వ లేకుండా బయటకు పంపే చర్యలు చేపట్టాలని మార్కాపురం వ్యవసాయ సహాయ సంచాలకులు డీ బాలాజీనాయక్ రైతులకు సూచించా రు. బుధవారం ఆయన తురిమెళ్ల, ఎర్రబాలెం, నర్సిరెడ్డిపల్లి గ్రామాల్లో వరి పొలాలను పరిశీలించారు. వరి పంట వెయ్యి ఎకరాలలో సాగులో ఉందన్నారు. పం ట అంతా దుబ్బుదశలో ఉందని ప్రస్తుత వర్షాలకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. కార్యక్రమంలో కంభం మండల వ్యవసాయ అధికారి షేక్ మహమ్మద్, వీఏఏ సత్యనారాయణ పాల్గొన్నారు.